మధుమేహం ఉన్నవారు ఏ పండ్లు తినాలి..? ఏ పండ్లు అస్సలు తినకూడదో తెలుసా..?

ప్రతి ఏడాది మధుమేహం వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి.

ఒకసారి వచ్చిందంటే జీవితాంతం దానితో సావాసం చేయాల్సిందే.ఇక మధుమేహం బారిన పడ్డవారు ఏం తినాలన్నా.

ఎక్కడ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయో అని భయపడిపోతుంటారు.ముఖ్యంగా ఫ్రూట్స్ లో ఏం తినాలి.? ఏం తినకూడదు.? అన్న అవగాహన లేక అన్నిటినీ ఎవైడ్ చేస్తుంటారు.కానీ ఇప్పుడు మధుమేహం ఉన్నవారు ఏ పండ్లు తినాలి.

ఏ పండ్లు అస్సలు తినకూడదు అన్న విషయాలు తెలుసుకుందాం.ముందుగా మధుమేహం ( Diabetes )ఉన్నవారు తినదగ్గ పండ్ల గురించి మాట్లాడుకుందాం.

Advertisement

జామ చవక ధరకే లభించినా ఎన్నో పోషకాలను కలిగి ఉంటుంది.మధుమేహం ఉన్నవారు రోజుకు ఒక జామ పండును తింటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచేందుకు జామ పండు సహాయపడుతుంది.అదే స‌మ‌యంలో ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పని తీరును పెంచుతుంది.

అలాగే బొప్పాయి పండును కూడా మధుమేహులు తీసుకోవచ్చు.బొప్పాయి తియ్య‌గా ఉంటుందని కొందరు దూరం పెడుతుంటారు.

కానీ బొప్పాయిని నిత్యం లిమిట్ గా తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

మధుమేహులు అవకాడో( Avocado ), స్ట్రాబెర్రీస్, కివీ, పైనాపిల్, ఆరెంజ్ వంటి పండ్లను ఎలాంటి భయం లేకుండా తీసుకోవచ్చు, ఈ పండ్ల లో షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.అందువ‌ల్ల‌ మధుమేహం ఉన్నవారు వీటిని తీసుకుంటే ఎలాంటి సమస్య రాదు.

ఇక అసలు తీసుకోకూడని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

సపోటాలో షుగర్ కంటెంట్ అనేది అధిక మొత్తంలో ఉంటుంది.సపోటా పండ్ల‌( Sapota Fruit )ను తీసుకుంటే మధుమేహుల్లో చ‌క్కెర స్థాయిలో ఒక్కసారిగా పెరిగిపోతాయి.కాబట్టి సపోటా పండ్లను ఎవైడ్ చేయండి.

అలాగే మామిడిపండ్లు మ‌ధుమేహుల్లో షుగ‌ర్ ల‌వెల్స్ ను పెంచుతాయి.అందుకే ఎంత ఇష్టం ఉన్నా సరే మధుమేహులు మామిడి పండ్లకు దూరంగా ఉండాలి.

ఒకవేళ అంతగా తినాలనిపిస్తే పుల్లగా ఉండే మామిడి పండ్లను ఎంచుకోవాలి.ఇక చెర్రీస్, ద్రాక్ష, పియర్స్, పుచ్చకాయ, పనస, మరియు బాగా పండిన అరటి పండులో షుగర్స్‌ అనేవి చాలా ఎక్కువ.

కాబట్టి మధుమేహం వ్యాధిగ్రస్తులు ఈ పండ్లను దూరం పెడితేనే ఆరోగ్యానికి ఎంతో మేలని నిపుణులు చెబుతున్నారు.

తాజా వార్తలు