ఆ హిట్ సాంగ్‌ను చిరంజీవి కొరియోగ్రాఫ్ చేశారనే సంగతి మీకు తెలుసా..??

ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మూవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి మెగాస్టార్ రేంజ్‌కి ఎదిగి చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడు చిరంజీవి.

( Chiranjeevi ) నా స్థాయికి రావడానికి చిరు పడిన కష్టాలు సవాళ్లు అన్నీ ఇన్నీ కావు.

ఎన్ని స్ట్రగుల్స్ ఎదురైనా సరే వాటన్నింటినీ దాటుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ రేంజ్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు.ఇప్పటికీ చిరంజీవి సోలో హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

ప్రస్తుతం "విశ్వంభర" మూవీ( Vishwambhara ) షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు.ఈ మూవీ కోసం స్పెషల్‌గా ట్రైనింగ్ కూడా తీసుకుంటూ స్పెషల్ లుక్ లో కనిపించనున్నాడు.

ఎక్ససైజ్ కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయనకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

Godave Godavamma Song Composed By Chiranjeevi Details, Godave Godavamma Song , C
Advertisement
Godave Godavamma Song Composed By Chiranjeevi Details, Godave Godavamma Song , C

అదేంటంటే ఒక హిట్ సాంగ్‌కు చిరంజీవి స్వయంగా కొరియోగ్రఫీ చేశారు.ఆ పాట పేరు "గొడవే గొడవమ్మ".( Godave Godavamma Song ) ఈ సాంగ్ మరణ మృదంగం( Marana Mrudangam ) సినిమాలోనిది.

చిరంజీవి కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ అప్పట్లో ఒక పెద్ద హిట్ సాధించింది.ఈ సాంగ్‌లో చిరు, సుహాసిని సేమ్ డ్యాన్స్ స్టెప్పులు వేస్తూ కనిపిస్తారు.ఈ పాట చూస్తే దీనికి కొరియోగ్రఫీ( Choreography ) చేయడం కొద్దిగా కష్టమే అని తెలుస్తుంది.

చిరంజీవి దీని కోసం బాగానే వర్క్ చేసినట్లు అర్థమవుతుంది.ఎందుకంటే ఇందులోని డ్యాన్స్ మూవ్స్ ప్రొఫెషనల్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేసిన విధంగానే ఉన్నాయి.

మరణం మృదంగం (1988) మూవీని కోదండరామిరెడ్డి డైరెక్ట్ చేయగా, ఇళయరాజా మ్యూజిక్ అందించాడు.

Godave Godavamma Song Composed By Chiranjeevi Details, Godave Godavamma Song , C
కోపాన్ని అదుపులోకి తెచ్చే బెస్ట్ టిప్స్ మీకోసం?

కేఎస్ రామారావు ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రాసిన నవల ఆధారంగా తెరకెక్కింది.ఇళయరాజా కంపోజ్ చేసిన ఈ మూవీ సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి.ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

Advertisement

దీనికి స్క్రీన్ ప్లే యండమూరి వీరేంద్రనాథ్ అందించారు.చాలా పెద్ద నవలను బాగా ట్రిమ్ చేసి కమర్షియల్ సినిమాగా మార్చేందుకు ఆయన చాలా కష్టపడ్డారు.

దానికి ఫలితం దక్కింది.ఈ సినిమా తర్వాత చిరంజీవి మరిన్ని యాక్షన్ ఫిలిం ఆఫర్స్ పొందాడు.

ఈ మూవీతో చిరంజీవి తాను ఒక మంచి డాన్సర్ మాత్రమే కాదు మంచి కొరియోగ్రాఫర్ అని కూడా నిరూపించుకున్నాడు.చిరు కొరియోగ్రఫీ చేసిన పాట యూట్యూబ్ లో అందుబాటులో ఉంది చూడవచ్చు.

తాజా వార్తలు