గోవా డ్రగ్స్ కేసు ప్రధాన నిందితుడు ఎడ్విన్ విడుదల

గోవా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన కీలక నిందితుడు ఎడ్విన్ బెయిల్ పై విడుదలయ్యాడు.

హైదరాబాదులోని చంచల్ గూడా జైలు నుంచి ఎడ్విన్ బెయిల్ పై విడుదల అయినట్లు సమాచారం.

కాగా డ్రగ్స్ కేసులో ఈ నెల 5వ తేదీన ఎడ్విన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.గోవాలో నెలరోజుల పాటు గాలించిన తెలంగాణ పోలీసులు ఎడ్విన్ ను అదుపులోకి తీసుకొన్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్ కు తీసుకొచ్చి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.మత్తు మాఫియా మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు ఎడ్విన్ ను పోలీసులు అరెస్ట్ చేసి పది రోజులు కూడా గడవక ముందే బెయిల్ పై విడుదల కావడం చర్చనీయాంశంగా మారింది.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?
Advertisement

తాజా వార్తలు