Gmail : జీమెయిల్ లో సరికొత్త ఫీచర్..ఇకపై ఈ-మెయిల్ రిప్లై మరింత సులభతరం..!

జీమెయిల్( Gmail ) వినియోగదారుల కోసం ఓ సరికొత్త అప్డేట్ త్వరలోనే పరిచయం చేసేందుకు గూగుల్ ప్రయత్నిస్తోంది.

ఈమెయిల్ రిప్లై కోసం చాట్ స్టైల్ ఇంటర్ఫేస్ ను ( Chat Style Interface ) మరో మూడు నెలల్లో జీమెయిల్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.ఈ మెయిల్స్ కు రిప్లై ఇవ్వడం మరింత సులభతరం అవుతుంది.

సాధారణంగా ఈమెయిల్ ( Email ) ఓపెన్ చేస్తే.కింద రిప్లై బాక్స్ కనిపిస్తుంది.

ఆ రిప్లై బాక్స్ లో మనం సమాధానం రాసి పంపిస్తాం.అయితే ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఈమెయిల్ రిప్లై బాక్స్ ఇంటర్ ఫేస్ ఇకపై మనకు చాట్ స్టైల్ లో కనిపిస్తుంది.

Advertisement

ఈమెయిల్ ఓపెన్ చేస్తే కింద కనిపించే రిప్లై, రిప్లై ఆల్, ఫార్వర్డ్, ఎమోజీ ఆప్షన్లు కనిపిస్తాయి.ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక ఆ ఆప్షన్లన్నీ ఈమెయిల్ పై భాగంలో కనిపిస్తాయి.

పిల్ షేప్ కంటైనర్లు, బటన్స్, అటాచింగ్ మీడియా, ఎమోజీ ఈమెయిల్ పై భాగంలో ఉంటాయి.

ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక యూజర్లకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే.గూగుల్ చాట్ ఇంటర్ ఫేస్( Google Chat Interface ) యూజర్లకు బాగా ఉపయోగపడుతుంది.జీమెయిల్ కు వచ్చిన మెయిల్స్ లేదంటే పంపించిన మెయిల్స్ ను ఫుల్ స్క్రీన్ లో చూసుకోవచ్చు.

ఈమెయిల్ కంపోజ్ చేసేటప్పుడు కీబోర్డ్ కనిపిస్తుంది.రిసిపెంట్ వివరాలు స్క్రీన్ ఎడమవైపున, సెండ్ బటన్ కుడివైపున ఉంటాయి.

Blitz Sécurité Des Joueurs Et Jeu Responsable
సూదిలేని టీకా వచ్చేస్తుంది..... స్వదేశీ తొలి డీఎన్ఏ ఆధారిత టీకా

ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది.త్వరలోనే జీమెయిల్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.స్మార్ట్ ఫోన్ పనిచేయాలంటే జీమెయిల్ ఉండాల్సిందే.

Advertisement

అన్నింటికీ జీమెయిల్ ను ప్రాథమికంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.కాబట్టి యూజర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీమెయిల్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.

తాజా వార్తలు