ఏపీలో రూ.200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ యూనిట్

పల్నాడు జిల్లా వంకాయలపాడులో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.దీనిలో భాగంగా సుగంధ ద్రవ్యాల పార్క్ ను ఆయన సందర్శించారు.

గ్లోబల్ స్పైసెస్ ప్రాసెసింగ్ పెసిలిటీ యూనిట్ ను ప్రారంభించారు.కాగా రూ.200 కోట్లతో గ్లోబల్ స్పైసెస్ యూనిట్ ప్రారంభమైంది.పరిశ్రమ పెట్టిన ఐటీసీ కంపెనీకి అండగా ఉంటామని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ 1గా ఉందని చెప్పారు.ప్రాసెసింగ్ యూనిట్ తో 14 వేల మంది రైతులకు మేలు కలుగుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు.ఏటా 20 మెట్రిక్ టన్నుల మిర్చి, సుగంధ ద్రవ్యాల ప్రాసెస్ జరుగుతుందన్నారు.1500 మందికి ఉద్యోగ అవకాశం కలుగుతుందని వెల్లడించారు.ప్రతి గ్రామంలో ఆర్బీకేల స్థాపనతో రైతులకు సాయం అందిస్తున్నామన్నారు.

ప్రతి జిల్లాలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.అదేవిధంగా కొత్తగా 33 వేల ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టినట్లు స్పష్టం చేశారు.

Advertisement
గ‌ర్భిణీల్లో విట‌మిన్ ఎ లోపం ఎన్ని అన‌ర్థాల‌కు దారితీస్తుందో తెలుసా?

తాజా వార్తలు