గ్లోబల్ లీడర్ షిప్ అందుకున్న పిచాయ్...!!!

అమెరికాలో భారతీయుడు మరో సారి సగర్వంగా తలెత్తుకుని తిరిగే ఘటన చోటు చేసుకుంది.

అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ లీడర్ షిప్ అవార్డ్ భారతీయుడైన సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ని వరించింది.

ఈ అవార్డ్ రావడం అంటే అంత సులభం కాదని, అలాంటి అవార్డు భారతీయుడిని వరించడం ఎంతో సంతోషంగా ఉందని భారత సంతతి వ్యక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అమెరికా –భారత వ్యాపార మండలి ప్రతీ ఏటా ఇచ్చే ఈ అవార్డ్ కి 2019 సంవత్సరానికి గాను సుదర్ పిచాయ్ తో పాటుగా ,నాస్‌డాక్‌ ప్రెసిడెంట్‌ అడెన ఫ్రీడ్‌మాన్‌ కూడా ఎంపిక అయ్యారు.వచ్చే వారం జరిగే భారత ఐడియా సదస్సు లో ఈ అవార్డ్ లు ప్రధానం చేస్తారు.భారత్ లో ఎంతో మంది యువతీ యువకులకి ఆదర్శంగా నిలిచిన సుందర్ పిచాయ్ కి ఈ గుర్తింపు రావడం భారత యువతలో మరింత పట్టుదల నింపుతుందని నుపుణులు అంటున్నారు.

భారత-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య సంభందాలకి దోహదం చేసే రెండు దేశాల అగ్రశ్రేణి కంపెనీల ఉన్నత అధికారులకి “యూఎస్‌ఐబీసీ” 2007 నుంచీ ప్రతీ ఏటా ఈ అవార్డులని ప్రధానం చేస్తోంది.ప్రజల యొక్క జీవితాల్ని మెరుగు పరచడంలో టెక్నాలజీ ప్రభావం ఏమిటో భారత్‌లో పుట్టి పెరిగిన నాకు బాగా తెలుసునని, ఈ అభివృద్ధిలో గూగుల్ పాత్ర ఎంతో కీలకమని పిచాయ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు