బిడ్డ చనిపోయిన బాధలో నేనుంటే మీ ప్రకటనలు ఏంటీ.. సోషల్‌ మీడియాకు ఒక తల్లి ఆగ్రహంతో బహిరంగ లేఖ

సోషల్‌ మీడియా ఈమద్య బాగా అభివృద్ది చెందింది.మన మూడ్‌కు తగ్గట్లుగా అందులో పీచర్స్‌ మారుతున్నాయి.

మన మూడ్‌ ఎలా ఉందో తెలుసుకుని మరీ అందులో యాడ్స్‌ మరియు ఇతరత్ర ఫుటేజ్‌ ఇస్తూ ఉంటుంది.కొన్ని సార్లు మాత్రం మనం విచారకరంగా ఉన్న సమయంలో ఉత్సాహకర ఫీడ్‌, యాడ్స్‌ సోషల్‌ మీడియాలో వస్తే మహా కోపం అనిపిస్తుంది.

బాధలో ఉంటే ఏంటీ ఈ యాడ్స్‌ అంటూ కోపం వస్తుంది.తాజాగా అమెరికాకు చెందిన వాషింగ్టన్‌ డీసీకి చెందిన ఒక మహిళ ఇదే పరిస్థితిని ఎదుర్కొంది.

వాష్టింగ్టన్‌ డీసీకి చెందిన జిలియన్‌ బ్రాకెల్‌ సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఉంటుంది.ఆమె గర్బవతి అయినట్లుగా ఆమె స్నేహితులు పెట్టిన పోస్ట్‌ల ద్వారా తెలుసుకున్న సోషల్‌ మీడియా ఆమెకు గర్బవతిగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ సమయంలో పాటించాల్సిన డైట్‌ ఇలా అన్ని రకాలుగా సలహాలు సూచనలు ఇస్తూ పోస్ట్‌లు కనిపించేవి.--> కాని ఆమె దృరదృష్టం కొద్ది ఆమెకు గర్బశ్రావం అయ్యింది.ఆమె తీవ్రమైన దుఖ:లో మునిగి పోయింది.

ఆమెను ఓదార్చుతూ ఎంతో మంది స్నేహితులు ఆమె కోసం సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు.అయితే ఆమె తాజాగా సోషల్‌ మీడియా ఓపెన్‌ చేసిన సమయంలో పిల్లల పెంపకం ఎలా, వారి సంరక్షణకు సంబంధించిన వస్తువులతో యాడ్స్‌ రావడం మొదలయ్యాయి.

దాంతో ఆమె తీవ్ర మనో వేదనకు గురైంది.గర్బస్రావం అయిన బాధలో నేను ఉంటే మీరు ఈ యాడ్స్‌ వేసి నన్ను మరింతగా క్రుంగతీస్తున్నారు.నేను గర్బవతిని అంటూ తెలుసుకున్న మీరు నాకు గర్బస్రావం అయిన సంగతి తెలియదా అంటూ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాలకు ఓపెన్‌ లెటర్‌ రాసింది.

Joka : Expérience Mobile, Paiements Et Mécanismes De L’ap...
Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable

ఆమె లేఖకు స్పందించిన సోషల్‌ మీడియా స్పందించి క్షమాపణలు చెప్పింది.మళ్లీ ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని హామీ ఇచ్చింది.

Advertisement