Gadwal Vijayalakshmi : కాంగ్రెస్ లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ( Gadwal Vijayalakshmi ) కాంగ్రెస్ లో చేరారు.

ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ క్రమంలో మేయర్ గద్వాల విజయలక్ష్మీకి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.కాగా గద్వాల విజయలక్ష్మీ తండ్రి రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు( K Kesavarao ) కూడా హస్తం గూటికి చేరనున్నారన్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy )తో భేటీ అయిన కేకే కాంగ్రెస్ పార్టీతో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పారు.సుమారు 55 ఏళ్ల పాటు కాంగ్రెస్ లో ఉన్నానన్న ఆయన తిరిగి సొంత ఇంటికి వస్తున్నట్లు చెప్పారన్న సంగతి తెలిసిందే.

The Foods That Help To Kill Breast Cancer Details
Advertisement

తాజా వార్తలు