Srilatha Shoban Reddy : బీఆర్ఎస్ కు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి రాజీనామా..!

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్( BRS ) షాక్ తగిలింది.

ఆ పార్టీ సభ్యత్వానికి జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి( Srilatha Shoban Reddy ) రాజీనామా చేశారు.

అలాగే బీఆర్ఎస్ రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్ష పదవికి శోభన్ రెడ్డి రాజీనామా చేశారు.పార్టీలో ఉద్యమ కారులకు మనుగడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల కాలంలో పార్టీ అనుసరిస్తున్న విధానాలు తీవ్రంగా బాధిస్తున్నాయని రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

కష్టకాలంలో మీతో ఉన్న ఉద్యమకారులకు పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం బాధకు గురిచేస్తుందని లేఖలో తెలిపారు.ఈ క్రమంలోనే రేపు డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి దంపతులు కాంగ్రెస్( Congress Party ) కండువా కప్పుకోనున్నారని సమాచారం.కాగా ఇటీవల మోతే శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని( CM Revanth Reddy ) కలిసిన సంగతి తెలిసిందే.

Advertisement
Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!

తాజా వార్తలు