నకిలీ వజ్రాలతో ఘరానా మోస ప్రయత్నం.. అడ్డంగా బుక్కైన నిందితులు..!

ఇటీవల కాలంలో కష్టపడి సంపాదించేవారు 25 మంది ఉంటే అడ్డదారుల్లో సంపాదించేవారు 75 మంది ఉన్నారు.

మనిషిని మోసం చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల్లో ఘరానా మోసాల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది.

కేవలం అమాయకులు కనిపిస్తే చాలు మాయమాటలతో బురిడీ కొట్టి లక్షల్లో మోసం చేసిన్నట్టేట ముంచేస్తున్నారు.ఇలాంటి కోవలోనే నకిలీ వజ్రాలతో( fake diamonds ) భారీ ఘరానా మోసం చేసే ప్రయత్నం విఫలం అయిన సంఘటన చిత్తూరు జిల్లాలోని పలమనేరులో చోటుచేసుకుంది.

అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

Gharana Fraud Attempt With Fake Diamonds , Fake Diamonds, Fraud, Chandrakumar A

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.పలమనేరు మండలంలోని ఎం.కోటూరు గ్రామానికి చెందిన కన్నయ్య గౌడ్ అనే వ్యక్తిని 12 నకిలీ వజ్రాలతో మోసం చేసేందుకు చంద్రకుమార్ ఆలియాస్ డేవిడ్( Chandrakumar alias David ), శ్రీనివాసులు అనే వ్యక్తులు ప్రయత్నించారు.చివరికి అడ్డంగా బుక్కై పోలీసుల చేతికి చిక్కారు.

Advertisement
Gharana Fraud Attempt With Fake Diamonds , Fake Diamonds, Fraud, Chandrakumar A

అసలు ఏం జరిగిందంటే.? 12 నకిలీ వజ్రాలను కన్నయ్య గౌడ్ కు చూపించి, ఇవి రూ.20 లక్షల రూపాయల ఖరీదైనవని, డబ్బు అవసరం ఉండడంతో కేవలం రూ.10 లక్షల రూపాయలకే విక్రయిస్తున్నామని చంద్రకుమార్, శ్రీనివాసులు నమ్మకపు మాటలు పలికారు.ఒకవేళ కావాలంటే వీటి నాణ్యతను పరీక్షించుకొని వచ్చి డబ్బులు ఇవ్వాలని ఆ నకిలీ వజ్రాలను కన్నయ్య గౌడ్( Kannayya Goud ) చేతికి ఇచ్చారు.

కన్నయ్య గౌడ్ ఆ వజ్రాలను పరీక్షించుకొని వచ్చేందుకు వెళ్లాడు.దారి మధ్యలో మరో వ్యక్తి కన్నయ్య గౌడ్ కోసం కాపు కాసి ఆ వజ్రాలను కొట్టేశాడు.

Gharana Fraud Attempt With Fake Diamonds , Fake Diamonds, Fraud, Chandrakumar A

ఈ విషయాన్ని చంద్రకుమార్, శ్రీనివాసులకు తెలుపగా తమకు రూ.10 లక్షల రూపాయలు లేదా వజ్రాలు తిరిగి ఇవ్వాలని కన్నయ్య గౌడ్ ను ఒత్తిడికి గురి చేశారు.నిందితుల బెదిరింపులను భరించలేకపోయిన కన్నయ్య గౌడ్ చివరికి పోలీసులను ఆశ్రయించాడు.

కూపి లాగితే డొంక కదిలినట్లు రంగంలోకి దిగిన పోలీసులకు కన్నయ్యను ట్రాప్ చేసేందుకే నిందితులు పక్కా ప్లాన్ ప్రకారం ఇలా ప్రయత్నించారని బయటపడింది.నిందితులైన శ్రీనివాసులు, చంద్రకుమార్ లను అదుపులోకి తీసుకొని, ఆ 12 నకిలీ వజ్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు