పాన్ ఇండియా రేంజ్ లో గజిని సీక్వెల్స్... అల్లు అరవింద్ ప్లాన్ మామూలుగా లేదు!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య( Suriya ) మురుగదాస్ ( Muragadas) కాంబినేషన్లో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ చిత్రం గజని( Ghajini ).

ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.

ఈ సినిమా ద్వారా తెలుగులో మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా ఎంతో మంది తెలుగు ప్రేక్షకులను కూడా సంపాదించుకున్నారు.ఇక డైరెక్టర్ గా మురుగదాస్ కి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి.

ఇలా గజినీ సినిమా ఎంతో మంచి సక్సెస్ సాధించింది.అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే పనిలో ఉన్నారు నిర్మాత అల్లు అరవింద్.

ఈ క్రమంలోని ఈ సినిమా సీక్వెల్ గురించి చర్చలు జరుగుతున్నాయి.

Ghajini Sequels In Pan India Range Allu Aravinds Plan Is Not Normal Ghajini Sequ
Advertisement
Ghajini Sequels In Pan India Range Allu Aravinds Plan Is Not Normal Ghajini Sequ

గజిని సినిమాలో సూర్య నటించగా గజిని సీక్వెల్ ( Ghajini Sequel ) చిత్రంలో మాత్రం నటించడానికి సూర్య పెద్దగా ఆసక్తి చూపించడం తెలుస్తోంది.ఈ క్రమంలోనే సూర్య బదులు ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్( Aamir Khan ) నటించబోతున్నట్లు సమాచారం.ఇక అమీర్ ఖాన్ గజిని సినిమాను హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

Ghajini Sequels In Pan India Range Allu Aravinds Plan Is Not Normal Ghajini Sequ

అయితే ఈ సినిమా సీక్వెల్ చిత్రాన్ని అల్లు అరవింద్( Allu Aravind ) పాన్ ఇండియా స్థాయిలో చేయబోతున్నారు.ఈ క్రమంలోనే సీక్వెల్ చిత్రంలో సూర్య ఆసక్తి లేకపోవడంతో అమీర్ ఖాన్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారట.

Ghajini Sequels In Pan India Range Allu Aravinds Plan Is Not Normal Ghajini Sequ

ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.ఇక ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలు అల్లు అరవింద్ ఉన్నారు.ఇక ఈ సినిమాకి కూడా మురుగదాస్ డైరెక్షన్ చేయబోతున్నారని తెలుస్తోంది.

ఇలా మురగదాస్ అమీర్ ఖాన్ అల్లు అరవింద్ కాంబినేషన్లో గజిని సీక్వెల్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్న వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది అయితే త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్టు సమాచారం.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు