Black Pepper Ghee : నల్ల మిరియాలు, నెయ్యి కలిపి తీసుకోవడం ద్వారా ఎన్ని జబ్బులకు చెక్ పెట్టవచ్చో తెలుసా?

నల్ల మిరియాలు.( Black Pepper ) వీటి గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు.

ఇండియన్ స్పైసెస్ లో నల్ల మిరియాలు అది ముఖ్యమైనవి.నల్ల మిరియాలను కింగ్ ఆఫ్ స్పైసెస్ అని కూడా పిలుస్తుంటారు.

ఆహారానికి నల్ల మిరియాలు చక్కని రుచిని అందిస్తాయి.అదే సమయంలో ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

ముఖ్యంగా నల్ల మిరియాలను నెయ్యితో( Ghee ) కలిపి తీసుకోవడం ద్వారా అద్భుతమైన లాభాలను మీ సొంతం చేసుకోవచ్చు.నెయ్యి, నల్ల మిరియాలు కలయిక ఎన్నో ప్రమాదకరమైన జబ్బులకు చెక్ పెడుతుంది.

Advertisement

మీరు ప్రతిరోజు ఉదయాన్నే వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన నెయ్యికి పావు టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి కలిపి తీసుకోవాలి.లేదా ఈ రెండిటిని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి కూడా తీసుకోవచ్చు.

ఇలా ఎలా తీసుకున్నా కూడా బోలెడు ప్రయోజనాలు చేకూరుతాయి.మధుమేహం( Diabetes ) ఉన్నవారికి ఈ కలయిక ఎంతో మేలు చేస్తుందని అధ్యయనాలు తేల్చాయి.

నల్ల మిరియాలు, నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

అలాగే నల్ల మిరియాలు నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుంది.తద్వారా గుండె సంబంధిత జబ్బులకు దూరంగా ఉండవచ్చు.మోకాళ్ళ నొప్పులతో( Knee Pains ) బాధపడేవారు ప్రతిరోజు నెయ్యిలో నల్ల మిరియాల పొడి కలిపి తీసుకుంటే చాలా మంచిది.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

న‌ల్ల మిరియాలు మ‌రియు నెయ్యి ఎముకలను బలోపేతం చేస్తాయి.మోకాళ్ళ నొప్పులను సమర్థవంతంగా అరిక‌డ‌తాయి.

Advertisement

అంతేకాదు నల్ల మిరియాలు నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల రోగ‌ నిరోధక శక్తి( Immunity Power ) పెరుగుతుంది.అనేక రకాల ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తి పొందుతారు.నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.

అలాగే ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.వెయిట్ లాస్( Weight Loss ) అవుతారు.

మెదడు చురుగ్గా పనిచేస్తుంది.మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు చిత్తవుతాయి.మరియు జీర్ణ సంబంధిత సమస్యలు సైతం వేధించకుండా ఉంటాయి.

తాజా వార్తలు