జాబ్‌ ఆఫర్‌ : కోటి రూపాయల సాలరీ, దంపతులకు ప్రాముఖ్యత... సింగిల్‌ రూంలో ఎంజాయ్‌ చేయొచ్చట

కొన్ని జాబ్‌లు అత్యంత విచిత్రంగా ఉంటాయి, మరి కొన్ని జాబ్‌లు అత్యంత కష్టతరంగా ఉంటాయి, మరి కొన్ని జాబ్‌లు మాత్రం అత్యంత సుఖదాయకంగా, సులువుగా చేసే విధంగా ఉంటాయి.ఈ జాబ్‌లకు తగ్గట్లుగా సాలరీ ఉంటుందనుకుంటే మాత్రం పొరపాటే.

రంగాన్ని బట్టి సాలరీ ఉంటుంది.కష్టమైన పని కదా అని ఆ పనికి ఎక్కువ, సులువైన పని కదా అని ఆ పనికి తక్కువ సాలరీ ఉండదు.ఆ పనిని బట్టి కాకుండా రంగాన్ని బట్టి కూడా సాలరీ ఉంటుంది.

అమెరికాలోని ఒక సింపుల్‌ జాబ్‌కు ఏకంగా కోటి రూపాయల ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది.

అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కో సముద్రంలో ఉండే ఒక ద్వీపం ఉంది.అందులో లైట్‌ హౌస్‌ను నిర్మించారు.దాదాపు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ లైట్‌ హౌస్‌లో ఉద్యోగం చేసేందుకు దరకాస్తును ఆహ్వానించారు.

ఇద్దరు వ్యక్తులు ఆ లైట్‌ హౌస్‌లో పని చేసేందుకు కావాలట.వారు దంపతులు అయితే మరీ బాగుంటుందని అంటున్నారు.అక్కడ చిన్న రూం మాత్రమే ఉంటుంది.

Advertisement

సోలో జీవితం, సింగిల్‌ రూం, చుట్టు ఎవరు ఉండరు, కావాల్సినవన్నీ కూడా అక్కడ ఉంటాయి.ద్వీపం వద్దకు వచ్చే టూరిస్టులకు ఆ ద్వీపం గురించి వివరించాలి.ఈ పనికి ఇద్దరికి కలిపి కోటి రూపాయల సాలరీని సంస్థ ఫిక్స్‌ చేసింది.

లైట్‌ హౌస్‌ నిర్వాహణ చాలా సులభతరమైన జాబ్‌ అని, కాకుంటే ఇందుకు గాను యూఎస్‌ కోస్టు గార్డు లైసెన్స్‌ను తప్పనిసరిగా కలిగి ఉండాలి.భార్య భర్తలు కోస్ట్‌ గార్డు లైసెన్స్‌ను కలిగి ఉండటం దాదాపు అసాధ్యంగా చెబుతున్నారు.కోస్టు గార్డు లైసెన్స్‌ ఉన్న వారు ఈ జాబ్‌పై ఆసక్తి చూపించరడం లేదు.

కాస్త కష్టం అయినా ఇతర జాబ్‌లు చేసుకుంటే వారికి అంతకు మించిన ఆదాయం వస్తుందట.అందుకే ఈ జాబ్‌పై ఎక్కువ శాతం ఆసక్తిని కనబర్చడం లేదని కొందరు అంటున్నారు.

అయితే భార్య భర్తలు కలిసి ఎంజాయ్‌ చేయాలనుకుంటే మాత్రం ఈ జాబ్‌ను ఎంపిక చేసుకుంటారని భావిస్తున్నారు.

ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Advertisement

తాజా వార్తలు