గౌతమ్ మీనన్ కోరిక సరే.. ఆ సినిమా పార్ట్-2కి సామ్, చైతూ ఒప్పుకుంటారా?

ఓటీటీ వచ్చిన తర్వాత చాలా వరకు ప్రేక్షకులు సినిమా థియేటర్లకు రావడం మానేశారు.

ఏవో పెద్ద సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లకు వస్తున్నారు తప్పితే మిగతా సినిమాలను ఓటిటి ద్వారానే వీక్షిస్తున్నారు.

ద్వారా కేవలం తెలుగు సినిమాలను మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలను కూడా వీక్షిస్తున్నారు.అయితే నిజాయితీగా చెప్పాలి అంటే సినిమాకు భాష లేదని లైఫ్‌ ఆఫ్‌ ముత్తు చిత్రంలో కొన్ని పాత్రలు హిందీ మాట్లాడతాయి.

ఈ డైలాగ్స్‌ ప్రేక్షకులకు అర్థం కాకపోయినా భావం అర్థం అవుతుంది అని చెప్పుకొచ్చారు దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌.గౌతమ్ వాసుదేవ్ మీనన్, శింబు కాంబినేషన్ లో రూపొందిన సినిమా గ్యాంగ్ స్టర్ ఫిల్మ్.

వెందు తనిందదు కాడు.కాగా ఇందులో సిద్ధీ ఇద్నాని హీరోయిన్ గా నటించింది.ఇషారి.

Advertisement

కె.గణేష్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15 న అనగా నేడు విడుదల అయ్యింది.కాగా ఈ సినిమాను ది లైఫ్‌ ఆఫ్‌ ముత్తు టైటిల్‌ తో శ్రీ స్రవంతి మూవీస్‌ సంస్థ ఈ నెల 17న తెలుగులో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.పల్లెటూరులో జీవించే ముత్తు ముంబై వెళ్లి, అనుకోకుండా చీకటి ప్రపంచంలోకి వెళ్తాడు.ఆ తర్వాత ఎలా బయట పడ్డాడు? అన్నదే ఈ సినిమా కథ అని తెలిపారు గౌతమ్ మీనన్.

అయితే ఈ సినిమాను కథ డిమాండ్‌ చేయడంతోనే రెండు పార్టులుగా రిలీజ్‌ చేస్తున్నారట. లైఫ్‌ ఆఫ్‌ ముత్తు ను తెలుగులో స్రవంతి రవికిశోర్‌గారు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది అని తెలిపారు గౌతమ్ మీనన్.అయితే తనకి నాగచైతన్యతో కలిసి ఏం మాయ చేసావే 2 సినిమా చేయాలని ఉంది అని తెలిపారు గౌతమ్ మీనన్.

అయితే గౌతమ్ మీనన్ కోరిక మేరకు నాగచైతన్యతో కలిసి ఏం మాయ చేసావే 2 సినిమా తీస్తారా.మరి అందుకు సమంత ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి మరి.అయితే ఏ మాయ చేసావే సినిమాలో నాగచైతన్య సమంత కలిసి నటించిన విషయం తెలిసిందే.మరి ఒకవేళ సమంత ఒప్పుకోకపోతే ఒక హీరోయిన్ పెట్టి సినిమా తీస్తే అది హిట్ అవుతుందా? లేదా అన్నది కూడా చూడాలి మరి.వీటితోపాటుగా గౌతమ్ మీనన్ కి కమలహాసన్ కి రాఘవన్ 2, వెంకటేష్ తో ఘర్షణ 2 సినిమాలు తీయాలని ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు.

మచ్చలు పోయి ముఖం తెల్లగా మారాలా.. అయితే ఈ రెమెడీని మీరు ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు