గ్యాస్ లీక్ తో పేలుడు.. 19 మంది సజీవదహనం.. ఎక్కడంటే..?

ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.ఆస్పత్రి లో గ్యాస్ లీక్ కావడంతో ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి.

దీంతో భారీ ప్రాణ నష్టం జరిగింది, ఒక్కసారిగా ఎగసిపడ్డ మంటల్లో వేగంగా 19 మంది సజీవ దహనమయ్యారు.అయితే ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డట్లు తెలుస్తోంది.

More Than 19 People Died In Iran, Iran, Gas Leakage, Iran News, Iran Media-గ�

మెడికల్ సెంటర్లో రాత్రి సమయంలో గ్యాస్ లీకేజీ వలన ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చు అని ఇరాన్ మీడియా అధికారిక ప్రకటన విడుదల చేసింది.అయితే ఈ భారీ అగ్నిప్రమాదంలో తొలుత 13 మంది మరణించినట్లు గుర్తించగా ఆ తర్వాత మరో ఆరు మృతదేహాలు కూడా బయట పడ్డాయి.

ఇక ఈ మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ఏకంగా కొన్ని గంటల పాటు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.హాస్పిటల్లో సెల్లార్ లో ఉన్న గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా లీక్ అవడంతో.

Advertisement

భారీ మొత్తంలో ఎగసిపడిన మంటలు ఏకంగా పై అంతస్తు వరకు వచ్చాయని.టెహ్రాన్ ఫైర్ విభాగం అధికారీ చెప్పుకొచ్చారు.

ఇక ఈ ప్రమాదంలో కొంతమంది మంటల్లో సజీవదహనం అయితే ఇంకొంతమంది దట్టంగా పొగ వ్యాపించడంతో ఊపిరాడక చనిపోయారు తెలిపారు.ఇక క్షతగాత్రులు అందరిని వైద్యం కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు