చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే వెల్లుల్లితో ఇలా చేస్తే ఒక్క దెబ్బకే మాయం!

చుండ్రు( Dandruff ) స్త్రీలే కాదు పురుషుల్లోనూ ఎందరో దీనికి బాధితులుగా ఉన్నారు.

చుండ్రు చిన్న సమస్యగానే కనిపించిన తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.

చుండ్రు కారణంగా తలలో విపరీతమైన దురద కలుగుతుంది.అలాగే జుట్టు రాలడం, పొడిగా మారిపోవడం జరుగుతుంది.

చుండ్రు వ‌ల్ల మొటిమలు కూడా వస్తుంటాయి.అందుకే చుండ్రును నివారించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే వెల్లుల్లితో చాలా సులభంగా చుండ్రును పోగొట్టుకోవచ్చు.

Advertisement

చుండ్రును నివారించగల సామర్థ్యం వెల్లుల్లికి( Garlic ) దండిగా ఉంది.మరి ఇంతకీ వెల్లుల్లిని ఎలా ఉపయోగించాలి.? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా పది వెల్లుల్లి రెబ్బలను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి సన్నగా తురుముకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె వేసుకోవాలి.ఆయిల్ హీట్ అవ్వడానికి ముందే వెల్లుల్లి తురుము, హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి( Cloves Powder ), నాలుగు రెబ్బలు కరివేపాకు వేసి చిన్న మంటపై ప‌ది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసి క్రీమీ స్ట్రక్చర్ వచ్చే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని షవర్ క్యాప్ ధరించాలి.గంటన్నర లేదా రెండు గంటల అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తలస్నానం చేయాలి.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇలా చేస్తే చుండ్రు దెబ్బకు మాయం అవుతుంది.చుండ్రు ఎంత తీవ్రంగా ఉన్నా సరే ఈ రెమెడీతో సులభంగా బయటపడొచ్చు.పైగా ఈ రెమెడీని పాటిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

Advertisement

తెల్ల జుట్టు( Grey Hair ) త్వరగా రాకుండా సైతం ఉంటుంది.కాబట్టి చుండ్రు సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్న వారు తప్పకుండా వెల్లుల్లితో పైన చెప్పిన విధంగా చేయండి.

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు