Ganta srinivasarao : ఏపీలో ఉప ఎన్నికలు తెచ్చేందుకు ' గంటా ' ఆరాటం ? 

విశాఖ నార్త్ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యవహారం ఎవరికి అర్థం కావడం లేదు.కనీసం సొంత పార్టీలోను ఆయన వైఖరి పై ఒక స్పష్టత లేదు.

2014లో టిడిపి నుంచి గెలిచిన గంటా ఆ తర్వాత మంత్రిగా కొనసాగారు.2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరేందుకు ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు.దీంతో మళ్లీ టిడిపి నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు.

ఇక అప్పటినుంచి ఆయన ఆ పార్టీకి దూరంగానే ఉంటూ సైలెంట్ గా ఉంటున్నారు.వైసీపీ పై విమర్శలు చేయడం గాని,  టిడిపి తరఫున యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాలు చేపట్టడం గానీ చేయకుండా మౌనంగానే ఉంటూ వస్తున్నారు.

అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్రం ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధమవడం తదితర వ్యవహారాలతో గంటా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామాను సమర్పించారు.      అయితే అప్పటినుంచి అది పెండింగ్ లోనే ఉంది.

గంటా  కూడా ఈ విషయంలో స్పీకర్ పై ఒత్తిడి తీసుకురాలేదు.ఇక వైసిపి ప్రభుత్వం కూడా ఉప ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో లేకపోవడంతో గంటా రాజీనామా లేఖను పెండింగ్ లో పెట్టారు.

Advertisement

అయితే మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది.ప్రధాని నరేంద్ర మోది విశాఖ పర్యటనకు వస్తున్న సమయంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నాయకులు దీనిపై మరోసారి ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

దీనిలో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు గంటాను కలిశారు.ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చ జరిగింది.

దీంతో మరోసారి గంట తన రాజీనామా లేఖ ను వెంటనే ఆమోదించాలంటూ స్పీకర్ ను కోరారు.   

   గతంలోనూ ఈ అంశంపై కోర్టుకు వెళ్లాలని గంటా భావించినా.సైలెంట్ అయిపోయారు.మళ్ళీ ఇప్పుడు ప్రధాని పర్యటన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి నేతలు ఒత్తిడితో రాబోయే రోజుల్లో రాజకీయ ప్రాధాన్యాలు ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్న ఆయన ఈ విషయంలో స్పీకర్ పై ఒత్తిడి చేయాలని నిర్ణయించుకున్నారు.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

ప్రస్తుత పరిస్థితుల్లో వైసిపి ప్రభుత్వం ఉప ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో లేదు.కానీ ఉప ఎన్నికలకు వెళ్తే మూడు రాజధానుల విషయంలో ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంది ? వైసీపీ ప్రభుత్వం పై వ్యతిరేకత ఉందా సానుకూలత ఉందా అనే విషయంలో స్పష్టత వస్తుంది.

Advertisement

తాజా వార్తలు