తెలుగు లో గట్స్ ఉన్న హీరో కేవలం వెంకటేష్ మాత్రమే..ఎందుకో తెలుసా ?

వెంకటేష్.ఈయన గురించి ఎంత చెప్పిన, ఎన్ని చెప్పిన తక్కువే అవుతుంది, చాల మంది టాలీవుడ్ హీరోలకు లేని మంచి క్వాలిటీస్ ఆయనలో ఉంటాయి.

గొప్ప నిర్మాత కొడుకు, మహా సామ్రాజ్యం ఉన్నప్పటికి అయన జీవించే తీరు, నడుచుకునే పద్ధతి చూస్తే ప్రతి ఒక్కరు ముచ్చట పడతారు.ఇక అయన కెరీర్లో అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించాడు.

అయితే ఇప్పటికి, ఎప్పటికి అయన సినిమాల్లో ప్రధమం గా మాట్లాడుకోవాల్సిన సినిమాల్లో ముందు వరసలో ఉండేది గణేష్ చిత్రం.ఇలాంటి సినిమా తీసే గట్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవరికి ఉండవు.అది కేవలం విక్టరీ వెంకట్ కి మాత్రమే సాధ్యం అయ్యింది.1998 లో వచ్చిన ఈ సినిమా తన తండ్రి మరియు అన్నయ్య నిర్మాతలుగా తీసింది కావడం విశేషం.ఈ చిత్రానికి తిరుపతి సామీ అనే యువకుడు దర్శకత్వం వహించగా, అది అతడికి మొదటి సినిమా.

ప్రభుత్వ హాస్పిటల్స్ లో జరుగుతున్న అన్యాయాలపైనా, అవినీతి పైన ఒక సాధారణ వ్యక్తి చేసిన పోరాటం పైన ఎంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.ఇక ఈ చిత్రం కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కాకపోయినా డీసెంట్ హిట్ గా నిలించింది.

Advertisement

ఇప్పటికి ప్రభుత్వ హాస్పిటల్ లో వ్యవస్థ లో ఎలాంటి మార్పు లేదు.జనాలు వాటి దగ్గరికి కూడా వెళ్లాలంటే భయపడుతున్నారు.అందుకే పుట్టగొడుగుల్లా కార్పొరేట్ ఆసుపత్రులు పుట్టుకస్తున్నాయి.

ఇక ఈ సినిమా మణిశర్మ సంగీతం అందించగా, ఈ చిత్రంలో నటించినందుకు గాను వెంకటేష్ బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫెర్ తో పాటు నంది అవార్డు కూడా లభిచింది.ఇలా ఒకేసారి రెండు బెస్ట్ యాక్టర్ అవార్డులు అందుకోవడం చాల అరుదుగా జరుగుతుంటాయి.

ఇంతటి సీరియస్ ఫిలిం లో గ్లామర్ డాల్ అయినా రంభను పోలీస్ ఆఫీసర్ గా తీసుకోవడం కూడా దర్శకుడి ప్రతిభను అద్దం పడుతుంది.కాళ్ళు పోగొట్టుకునే పాత్రలో మధు బాల చక్కగా నటించింది.

కోట శ్రీనివాస్ రావు తో వెంకటేష్ పోటీ పడి నటించే సన్నివేశాలు ఎంతో బాగా వచ్చాయి.

వైరల్ వీడియో : పాఠాలు వింటూనే గుండెపోటుకు గురైన చిన్నారి.. చివరకి?
Advertisement

తాజా వార్తలు