ఏలూరు జిల్లాలో గాంధీ విగ్ర‌హాం ధ్వంసం

ఏలూరు జిల్లా ఉంగుటూరు మండ‌లం తిమ్మాయిపాలెంలో డంపింగ్ యార్డ్ లో ఉన్న మ‌హాత్మాగాంధీ విగ్ర‌హాన్ని గుర్తు తెలియ‌ని దుండ‌గులు ధ్వంసం చేశారు.

ఈ సంఘ‌ట‌న‌పై చేబ్రోలు పోలీస్ స్టేష‌న్ లో గ్రామ స‌ర్పంచ్ ఫిర్యాదు చేశారు.

ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.ఈ క్ర‌మంలో విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గ్రామ ప్ర‌జ‌లు కోరుతున్నారు.