ఈ గట్టునుంటావా అరుణమ్మ ఆ గట్టుకెళ్తావా ..?

చిత్తూరు జిల్లా రాజకీయాల్లో మంచి పట్టు ఉన్నగల్లా కుటుంబానికి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చిపడింది.

ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న గల్లా ఫ్యామిలీ నుంచి జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉన్నారు.

ఇక జయదేవ్ తల్లి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి.పార్టీ మారతారన్న వార్తలు బలంగా వినిపిస్తుండడంతో ఆమె కొడుకు, గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇరకాటంలో పడ్డారు.

ఇప్పుడిప్పుడే టీడీపీలో నిలదొక్కుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న జయదేవ్ కు తల్లి అరుణ కుమారి వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారిందట.

ఇక గల్లా ఫ్యామిలీ రాజకీయ చరిత్ర చూసుకుంటే.గల్లా అరుణకుమారి జిల్లా స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు.వైఎస్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేసారు.

Advertisement

వైఎస్ మృతి, రాష్ట్ర విభజన లాంటి పరిణామాల నేపథ్యంలో ఆమె 2014 మార్చిలో టీడీపీలో చేరారు.మరుసటి నెల్లోనే గుంటూరు ఎంపీ సీటు తన కొడుకు జయదేవ్ కి ఇప్పించుకుని పార్లమెంట్ మెట్లు ఎక్కించారు.

అంతకుముందు.ఎమ్మార్ కుంభకోణంలో మాజీ మంత్రి హోదాలో గల్లా అరుణకుమారి అక్రమాలకు పాల్పడ్డారని అభియోగాలున్నాయి.రూ.2.2 కోట్ల విలువైన భూముల్ని చేజిక్కించుకున్నారంటూ ఈ కేసులో ఎంపీ జయదేవ్ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.టీడీపీలో ఇమడలేక మొదటినుంచీ సతమతమయ్యేవారు గల్లా అరుణకుమారి.2016 జూలైలోనే ఆమె పార్టీ మీద అసంతృప్తి వెళ్లగక్కారు.తనకు ఎమ్మెల్సీ పోస్ట్ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటానని మాటిచ్చిన చంద్రబాబు.

ఆ తర్వాత ఆ ఊసే ఎత్తకపోవడంతో ఆమె ఉడికిపోతున్నారు.కనీసం జిల్లా స్థాయి పార్టీ కార్యకలాపాల్లో కూడా తనకు ప్రాధాన్యం లభించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

పైగా.తిరుపతి మహానాడులో వంట పనుల బాధ్యతనిచ్చి తనను తీవ్రంగా అవమానించారని ఆమె అనుచరుల దగ్గర ఆవేదన కూడా చెందారట.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
బ్రెయిన్ సూపర్ షార్ప్ గా పని చేయాలంటే ఈ జ్యూస్ తాగండి..!

ఇక వచ్చే ఎన్నికల్లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న టీడీపీ అధిష్టానం మాటతో ఆమె విభేదించినట్లు తెలుస్తోంది.రెండేళ్లుగా అరుణకుమారి వైసీపీతో టచ్‌లో వున్నారని.

Advertisement

ఎన్నికలకు ముందు పార్టీ మారే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి.అమెరికా నుంచి రాగానే.

గల్లా పార్టీ మార్పుపై నిర్ణయం వెల్లడిస్తారన్న వార్తలు.టీడీపీలో వున్న కొడుకు జయదేవ్‌ని ఇబ్బందిపెట్టేశాయి.

తన తల్లికి పార్టీ మారే ఉద్దేశ్యమే లేదని ఇదంతా వట్టి పుకార్లే అని జయదేవ్ సర్ది చెప్పుకుంటున్నాడు.కానీ నిప్పు లేనిదే పొగ రాదు కదా ! .

తాజా వార్తలు