గజల్ భాగోతం వెనుక అసలు స్టొరీ ఇదేనా..?

గజల్ ఈ పేరు చెప్పగానే గుర్తువచ్చేది మూడు గిన్నిస్ రికార్డ్స్.ఎంతో మందిని అలరించిన ఆయన గజల్ పాటలు.

దేశవిదేశాల్లో అనేకమంది అభిమానులు ఉన్నారు గజల్ శ్రీనివాస్ కి.ఎన్నో పేరు ప్రఖ్యాతలు, సన్మానాలు ఒక టి కాదు రెండు కాదు ఎన్నో బిరుదులూ అవార్డులు.ఇలా గొప్ప వ్యక్తిగా చాలామణీ అయిన గజల్ శ్రీనివాస్ చరిత్ర అంతా ఒక్క వీడియోతో తునా తునకలు అయ్యిపోయింది.

గజల్ ని ఏ నోటితో అయితే పొగిడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సైతం గజల్ మీద దుమ్మెత్తిపోయడం తో పరువు మొత్తం హైదరాబాద్ మూసీలో కొట్టుకు పోయింది.సమాజం సిగ్గుపడేలా తాను చేసిన ఈ పని మళ్ళీ గజల్ కి పూర్వ వైభోగం తెచ్చి పెడుతుందా అనే అది అసంభవం అనే చెప్పాలి.

అయితే అసలు గజల్ పై ఇంత పక్కా స్కెచ్ మాత్రం వేరే వ్యక్తి అంటూ ఇప్పుడు మీడియా వర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది.గజల్ వెనుక భారీ కుట్ర జరిగింది అనే అనుమానాలు ఇప్పుడు అందరికీ పెద్ద డౌట్ క్రియేట్ చేస్తున్నాయి.

Advertisement

గజల్ శ్రీనివాస్ పనిమనిషితో కలిసి రాసలీలలు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.అయితే గజల్ శ్రీనివాస్ భాగోతం బయటకు రావడానికి ప్రధాన కారణం ఆయన నేతృత్వంలోని ఆలయవాణి వెబ్ రేడియోలో పనిచేస్తున్న జాకీ.

ఆమె ఫిర్యాదు చేయడంతో తెరవెనుక బాగోతాలన్నీ బయటికొచ్చాయి.అయితే ఆమె వాంటెడ్ గానే కొన్నాళ్లుగా గజల్ శ్రీనివాస్ వీడియోలను రికార్డు చేస్తున్నారనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.ఇప్పుడు బయటికొస్తున్న వీడియోలలో ఆమె ఒకచోట మాత్రమే కనిపిస్తోంది.మిగిలినచోట్ల పనిమనిషితో గజల్ శ్రీనివాస్ రాసలీలలు మాత్రమే ఉన్నాయి.

అయితే ఆ వీడియో లో గజల్ రాసలీలలు సాగించింది మాత్రం పని మనిషితో కానీ వారి ఇరువురి మధ్య సంభందం అనేది వారి వారి వ్యక్తిగత విషయం.ఈ వీడియో లో బహిర్గతం అయ్యి గజల్ పరువు రోడ్డున పడటానికి మాత్రం ఒక మీడియా పెద్ద ఉన్నారు అనేది పొలిటికల్.

మీడియా టాక్.అసలు ఆ పెద్ద తలకాయ ఎందుకు ఇలా చేసిందో అని ఆలోచించిన వారికి ఒక్కటే సంధానం దొరికింది అదే గజల్ కి ఆధ్యాత్మిక విభాగంలో పద్మశ్రీ వస్తుందనే విషయం.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
పుత్రికోత్సాహంలో జగన్.. మమ్మల్ని ఎంతో గర్వపడేలా చేసావంటూ ట్వీట్

ఇక్కడే గజల్ కి ఆ అవకాశం రాకుండా చెక్ పెట్టాలని చూసిన ఆ మీడియా అధినేత ఈ తతంగాన్ని వెనుక ఉండి నడిపించారు అని తెలుస్తోంది.వాస్తవానికి రేడియో జాకీతో గజల్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆధారాల్లేవు , బయటకి బహిర్ఘతం అయిన వీడియోలలో ఆమె కూడా కేవలం పనిమనిషితో మాత్రమే అక్రమ సంభందం ఉన్నట్టుగా తెలిసింది.

Advertisement

అది కూడా వారి వ్యక్తిగత వ్యవహారం కూడా.ఈ విషయాన్నే.

కోర్టులో గజల్ తరుపు న్యాయవాదులు కూడా వాదించారని తెలుస్తోంది.స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఉద్దేశపూర్వకంగా చేసిన వ్యవహారాలపై కేసులు పెట్టడం భావ్యం కాదని తెలిపారు.

అందుకు సంబంధించి ఆయన కొన్ని ఆధారాలను కూడా కోర్టు ముందు ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది.అయితే గజల్ బెయిల్ పై ఇప్పట్లో వచ్చే అవకాశం లేకపోయినా తన తరుపు లాయర్లు మరిన్ని ఆధారాలని ఈసారి బయటపెట్టి గజల్ ని బయటకి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు.

తాజా వార్తలు