Masooda Gaalodu : గాలోడు మాత్రమే కాదు ఆ సినిమా కూడా హిట్‌ అయ్యిందట!

మొన్న శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు సుడిగాలి సుదీర్ హీరో గా నటించిన గాలోడు చిత్రం వచ్చిన విషయం తెలిసిందే.

అది కాకుండా మరి కొన్ని సినిమా లు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

అయితే సుధీర్ సినిమా మాత్రమే సక్సెస్ టాక్‌ దక్కించుకుందని.ఇతర సినిమా లు కనిపించకుండా పోయాయి అంటూ అంతా భావించారు.

కానీ తాజాగా వస్తున్న కలెక్షన్స్ ని చూసి అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.సుడిగాలి సుదీర్ ఇప్పటికే ఐదు కోట్ల రూపాయల కలెక్షన్స్ ని దక్కించుకుని బ్రేక్ ఈవెన్ సాధించాడు.

ఇదే సమయం లో మరో సినిమా కూడా బ్రేక్ ఈవెన్ సాధించి అందరినీ ఆశ్చర్య పరచుతోంది.సంగీత మరియు తిరువీర్ ముఖ్య పాత్రలో నటించిన మసూద సినిమా కూడా మొన్నటి శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement

హర్రర్ నేపథ్యం లో రూపొందిన సినిమా కు సంబంధించిన రివ్యూలు పాజిటివ్ గా వచ్చినప్పటికీ ప్రేక్షకులు పెద్దగా ఎవరు తెలియని సినిమా కనుక వెళ్తారా.లేదా అని అంతా భావించారు.

కానీ మసూద సినిమా కి మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి.ఇప్పటికే నాలుగున్నర కోట్ల రూపాయల కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టింది అంటూ బాక్సాఫీస్ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

సుడిగాలి సుదీర్ గాలోడు సినిమా మాత్రమే కాకుండా మసూద సినిమా కూడా మంచి వసూలు రాబడుతున్న నేపథ్యం లో వచ్చే వారం వరకు ఈ సినిమా లు బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం సుడిగాలి సుదీర్ తో పోటీ గా మసూద సినిమా కలెక్షన్స్ రాబడుతుంది.

ముందు ముందు గాలోడు సినిమా ను క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాతోనైనా భావన కెరీర్ గాడిలో పడుతుందా.?
Advertisement

తాజా వార్తలు