చెల్లో షో అసలు భారతీయ సినిమా కానే కాదు.. సినిమా చూడకుండానే నామినేషన్ లోకి?

చెల్లో షో. ఈ సినిమాను ఇటీవలే ఆస్కార్ కు ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఇక అప్పటినుంచి ఈ సినిమాపై రోజురోజుకీ విమర్శలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి.ఈ సినిమాను ఆస్కార్ కు ఎలా పంపుతారు అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ సినిమాను ఆస్కార్ కు ఎంపిక చేయడం తప్పు అని ఖండించారు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినిమా ఎంప్లాయిస్.అసలు ఇది భారతీయ సినిమానే కాదు అని వారు కొట్టి పడేశారు.

అంతేకాకుండా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మరొకసారి తమ ఎంపికను సరిచూసుకోవాలి అని వారు కోరారు.కాగా ఈ విషయంపై తీవ్ర చర్చలు నడుస్తూ ఉండడంతో ఎఫ్డబ్ల్యూఐసిఈ ప్రెసిడెంట్ బీన్ తివారి మాట్లాడుతూ చెల్లో షో అసలు భారతీయ సినిమానే కాదు.

Advertisement

ఈ సినిమాను హాలీవుడ్ లాస్ట్ ఫిలిం షో గా రిలీజ్ చేయడం జరిగింది.మరి అలాంటప్పుడు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ సినిమాగా ఈ సినిమాను ఎలా ఎంపిక చేస్తారు అని ఆయన ప్రశ్నించారు.

ఫెడరేషన్ సభ్యుల్లో చాలామంది ఈ సినిమాను చూడకుండానే నామినేట్ చేశారు అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అలాగే ఈ సినిమాను సిద్ధార్థ రాయ్ కపూర్ కొనుగోలు చేశాడు అన్న ఒకే ఒక కారణంతోనే ఈ సినిమాను ఆస్కార్ కు ఎంపిక చేశారు అని ఆయన తెలిపారు.

ఈ సినిమానే కాకుండా పోటీలో ఆర్ఆర్ఆర్, కాశ్మీర్ ఫైల్స్ లాంటి ఎన్నో మంచి మంచి సినిమాలు ఉన్నాయి.అవి భారతీయ సినిమాలు కానీ వాటిని నామినేషన్లు ఎందుకు తీసుకోలేదు అని ప్రశ్నించారు.అంతే కాకుండా అసలు సినిమా చూడకుండానే ఆస్కార్ కు నామినేట్ చేయడం అన్నది సిగ్గుచేటు భారతీయ సినిమాలకి అవమానం అని ఆయన మండిపడ్డారు.

ఇదే విషయం గురించి మేము కేంద్ర ప్రభుత్వం తో కూడా మాట్లాడాలి అనుకుంటున్నాము అని ఆయన తెలిపాడు.ఈ వాక్యలు సోషల్ మీడియాలు తెగ వైరల్ అవడంతో నెటిజెన్స్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

White Hair : తెల్ల జుట్టు రావడం స్టార్ట్ అయిందా.. వర్రీ వద్దు ఈ ఆయిల్ ను వాడితే మీ కురులు మళ్లీ నల్లగా మారడం ఖాయం!
Advertisement

తాజా వార్తలు