అంతిమ యాత్రలో అపశృతి :బోల్తా పడిన వాహనం ,21 మందికి గాయాలు

కాన్వెంట్ జంక్షన్ వద్ద అంత్యక్రియలకు మృత దేహం తీసుకుని వెళ్తున్న వాహనం బోల్తా విశాఖలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

స్థానికులు అందించిన వివరాల ప్రకారం ఇలా ఉంది.

పూర్ణ మార్కెట్ సమీపంలోని రెల్లివీధిలో ఓ మూగ మనిషి అనారోగ్యంతో మృతి చెందారు.ఈ నేపథ్యంలో స్థానికులు పాడుకట్టి వాహనం మీద అంత్యక్రియలకు తరలిస్తుండి ఆచారం ప్రకారం కొబ్బరితోట పొలిమేర వద్ద పాడు దించారు.

అనంతరం దహన సంస్కరణలు నిమిత్తం కాన్వెంట్ సమీపంలోని చావులమదం శ్మశాన వాటికకు తరలిస్తుండగా ఈ నేపధ్యంలో ఆకస్మికంగా వాహనం తిరగబడి ప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో వాహనం మీద ఉన్న సుమారు 21 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

గమనించిన పలువురు స్థానికులు ఘటన చోటుకు హుటాహుటిన చేరురుకొని గాయపడిన క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్కు ఆటోల్లో తరలించారు.

Advertisement
5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide

Latest Vizag News