వైరల్‌ : కరివేపాకు ఇప్పటి వరకు ఔషదం, ఇకపై విషం

ఇండియన్స్‌ ముఖ్యంగా తెలుగు వారు కరివేపాకుకు చాలా ప్రాముఖ్యత ఇస్తారు.ప్రతి కూరలోను కరివేపాకును ఉపయోగిస్తారు.

కరివేపాకు వేయడంతో మంచి రుచిని ఆ పదార్థం పొందుతుంది.కూరలో కరివేపాకు వేస్తారు కాని చాలా మంది తినరు.

కాని దాన్ని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయంటూ ఇన్ని రోజులు చెప్పుకున్నాం.కరివేపాకుకు ఎన్నో ఔషదగుణాలు ఉండటంతో పాటు ఆయుర్వేద మందుల్లో ఔషదంగా కూడా కరివేపాకును ఉపయోగిస్తామని గతంలో చెప్పుకున్నాం.

ఇన్ని రోజులు మనం ఔషదంగా భావిస్తున్న కరివేపాకును కూరలో కరివేపాకు తీసి వేసినట్లుగా శాస్త్రవేత్తలు తీసి వేస్తున్నారు.

Curry Leaves In Indian Food, Vegetables, Poision Vegetables And Fruits, Curry Le
Advertisement
Curry Leaves In Indian Food, Vegetables, Poision Vegetables And Fruits, Curry Le

ప్రముఖ ఆహార పరిశోదన సంస్థ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చెప్పిన ఒక విషయం ప్రస్తుతం కరివేపాకు అంటేనే భయం కలిగేలా చేస్తుంది.కేవలం కరివేపాకు మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో కూరగాలపై ఈ సంస్థ పరిశోదనలు చేస్తూ వస్తోంది.వేలాది శాంపిల్స్‌ను సేకరిస్తూ వాటిపై పరిశోదనలు చేస్తున్న ఈ సంస్థ చాలా కాలంగా ఒక విషయాన్ని చెబుతూ వస్తోంది.

ఈమద్య కాలంలో చాలా కూరగాయాలు విషతుల్యం అవుతున్నాట.రసాయనాలు, ఎరువులు అధికంగా వేస్తూ పంటలు పండిస్తున్న కారణంగా కూరగాయలతో పాటు మనం తినే పండ్లు మరియు ఇతర పదార్థాలు అన్ని కూడా విషం అవుతున్నట్లుగా సదరు సంస్థ ప్రకటించింది.

Curry Leaves In Indian Food, Vegetables, Poision Vegetables And Fruits, Curry Le

ఇన్ని రోజులు కూరగాయలు మరియు పండ్లపై మాత్రమే ఈ సంస్థ అధ్యయనం చేసింది.మొదటి సారి దాదాపు వెయ్యి చోట్ల నుండి తెప్పించిన కరివేపాకును పరిశీలించింది.ఆ కరివేపాకును దీర్ఘంగా అధ్యయనం చేసిన తర్వాత వాటిలో సగంకు పైగా విషతుల్యం అయ్యాయట.

విష పదార్థాలు ఆ ఆకులపై ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.విషపు కరివేపాకును మనం ఇంతకాలం తింటున్నామంటూ వారు చెబుతున్నారు.

హెయిర్ ఫాల్‌తో బాధ‌ప‌డే పురుషుల‌కు బెస్ట్ హెయిర్ ప్యాకులు ఇవే!

చాలా స్వల పరిమాణంలో విష పదార్థాలు ఉన్న కారణంగా ఏం కాదని, కాకుంటే చిన్న పిల్లలకు మాత్రం ఈ కరివేపాకు పదార్థాలు పెట్టడం మంచిది కాదని వారు అంటున్నారు.

Advertisement

విషతుల్యమైన ఆహారంను

సుదీర్ఘ కాలం

తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.ఔషదం అయిన కరివేపాకు కూడా విషం అయితే మరేం తినాలంటూ జనాలు గుండెలు బాదుకుంటున్నారు.ప్రస్తుతం ఈ సంస్థ సర్వే ఫలితం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

తాజా వార్తలు