Electric Powered Shuttle Buses : రోడ్లపైకి రానున్న డ్రైవర్లు లేని బస్సులు.. ప్రత్యేకతలు ఇవే

కొంత మంది వాహనాలను నడుపుతూ స్టీరింగ్ వదిలేస్తుంటారు.వాహనంలో ఉన్న మిగిలిన వారు భయపడుతుంటారు.

అయితే ఫ్యూచర్‌లో అసలు డ్రైవరే లేని బస్సులు ఉంటాయంటే నమ్ముతారా.కానీ ఇది నిజం.

డ్రైవర్ రహిత బస్సులు త్వరలోనే రోడ్లపై పరుగులు తీయనున్నాయి.ఇటలీ తన మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.

ఇప్పుడు ఎలక్ట్రిక్-పవర్డ్ షటిల్‌లు ఇప్పుడు టురిన్‌లో పరీక్ష కోసం పైలట్ ప్రాజెక్ట్‌గా రోడ్లపైకి వస్తున్నాయి.ఆటోమేటిక్ వాహనాన్ని ఫ్రెంచ్ స్టార్ట్-అప్ నవ్య అభివృద్ధి చేసింది.14 మంది వరకు ప్రయాణించవచ్చు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

Advertisement

ఆటోమేటిక్ వాహనం సాధారణ పట్టణ ట్రాఫిక్‌లో డ్రైవ్ చేయగలదు.అడ్డంకులు, కార్లు, సైకిళ్లు లేదా పాదచారులను గుర్తించడానికి దాని GPS, ఇతర సెన్సార్‌లను ఉపయోగించవచ్చు.

అయితే ఈ పైలట్ ప్రాజెక్ట్ సమయంలో, అవసరమైతే జాయ్‌ప్యాడ్‌ని ఉపయోగించి వాహనాన్ని నడిపేందుకు డ్రైవర్ ఎల్లప్పుడూ ఉంటారు.పరీక్షల తర్వాత, టురిన్ ఆసుపత్రి ప్రాంతంలో రెండు కిలోమీటర్ల మార్గంలో మార్చి 2023 వరకు షటిల్ అందుబాటులో ఉంటుంది.

షటిల్ గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ వేగాన్ని అందుకోగలదు.సగటు బ్యాటరీ జీవితకాలం సుమారు 9 గంటలు ఉంటుంది.అక్టోబర్ 2022 నుండి మార్చి 2023 వరకు, ఇది వారాంతపు రోజులలో 6 గంటలు, ప్రభుత్వ సెలవు దినాల్లో 4 గంటల పాటు సర్వీస్‌ అందుబాటులో ఉంటుంది.

ఆటోనోమో జీటీటీ యాప్ ద్వారా రైడ్‌లను బుక్ చేసుకోవచ్చు.ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలకు త్వరలో అందుబాటులోకి వస్తుంది.వాహనం వికలాంగులకు కూడా అందుబాటులో ఉంటుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్ 1, శనివారం 2023

హారిజన్ 2020 ప్రోగ్రామ్‌లో యూరోపియన్ యూనియన్ నిధులు సమకూర్చిన ప్రాజెక్ట్ షోలో భాగంగా ఈ ప్రయోగం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు