ఉగ్రవాద దాడిలో భార్యను కోల్పోయిన అతను పెట్టిన పోస్ట్ చూస్తే కన్నీళ్లొస్తాయి.! ఒక్కో అక్షరం గుండెను మెలిపెట్టి తిప్పింది

ఫ్రాన్స్ లో ఉగ్రవాద నరమేధంలో తన భార్యను కోల్పోయిన తర్వాత ఓ భర్త తన పేస్ బుక్ అకౌంట్ లో పెట్టిన పోస్ట్ ప్రపంచం చేత కన్నీటిని పెట్టిస్తుంది.

భార్య పట్ల అతనికున్న ప్రేమను అక్షరాల్లో తెలుపుతూ.

అతడు చేేసిన పోస్ట్ మిలియన్లలో షేర్ అవుతూ ఫ్రాన్స్ ను దాటి ప్రపంచ నలుమూలల ఉన్న ఫేస్ బుక్ యూజర్ల మనసులను తాకుతూనే ఉంది.అతను వాడిన ఒక్కో మాట.బాణంలా గుండెను తాకుతుంటే.కంటి నుండి నీరు మన ప్రమేయం లేకుండానే బుగ్గను తాకుతుంది.

అతని మాటల ప్రకారం.

ఓయ్ ఉగ్రవాదులారా.! శుక్రవారం రాత్రి మీరు నా నుంచి నా జీవితాన్ని దూరం చేశారు.నాకు భార్యను, నా బిడ్డకు తల్లిని మా నుండి దూరం చేశారు.

Advertisement

మీరెవరో నాకు తెలియదు.తెలుసుకోవాలని కూడా నాకు లేదు.

మీరంతా చచ్చినవాళ్లతో సమానం.మీరు నా భార్య శరీరంలో దింపిన ప్రతి బులెట్ ఆ దేవుడికి తగిలినదే.

మీపై అసహ్యం కూడా కలగడం లేదు.ఇకపై కూడా నేను గతంలోలానే జీవించడానికి ప్రయత్నిస్తాను,ఇప్పటికీ నా భార్య తన పక్కనే ఉందనుకొని జీవిస్తాను, 12 సంవత్సరాల నుంచి తను ఎంత అందంగా కనిపించేదో, ఇప్పుడూ అంతే అందంగా నా మనసులో ఉంది, ఆ స్థానం నుంచి ఆమెను.

నువ్వు కానీ, నీ తుపాకీ తూటాకానీ కదిలించలేరు.ఓయ్ ఉగ్రవాదులారా మీకు లభించింది చిన్న విజయం మాత్రమే.

మీ జ్ఞాపకశక్తి తగ్గినట్టు అనిపిస్తుందా.. అయితే వెంటనే ఇలా చేయండి!
Advertisement

తాజా వార్తలు