ఎక్కడికెళ్తోంది ఈ ఫ్రీ బస్సు స్కిం..? బస్సులో తెగ కొట్టుకున్న ప్రజలు!

ప్రజా రవాణాలో ఎప్పటి నుంచో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు ఇటీవల బస్సుల్లో మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి.

మహిళలు, వృద్ధులు, సాధారణ ప్రయాణికుల మధ్య చోటు చేసుకునే వివాదాలు, గందరగోళం, ఒక్కోసారి ఘర్షణలుగా మారిపోతున్నాయి.

మరీ ముఖ్యంగా రద్దీ సమయాల్లో బస్సుల్లో సీట్లు కోసం( Bus Seats ) జరిగే గొడవలు సామాన్యంగా మారాయి.తాజాగా తెలంగాణలో( Telangana ) ప్రారంభమైన ఉచిత బస్సు ప్రయాణ పథకం( Free Bus Scheme ) వలన ఈ సమస్యలు మరింత ఊపందుకున్నాయి.

పదేళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, తొలి రెండు రోజుల్లోనే తన ఎన్నికల హామీలను అమలు చేయడంలో మొదటి అడుగు వేసింది.ఇందులో భాగంగా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించింది.

అయితే, ఈ పథకం ఆశించిన ప్రయోజనాలను ఇవ్వకుండా, ప్రభుత్వానికి తలనొప్పి మిగిలేలా చేసింది."ఉచితం" అనే మాట వినగానే, మహిళలు పెద్ద ఎత్తున బస్సుల్లో ప్రయాణం చేయడం ప్రారంభించారు.

Advertisement
Free Bus Scheme In Telangana Leads To Chaos Daily Fights And Overcrowding Highli

రోజూ భారీ సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో బస్సుల్లో తీవ్ర రద్దీ ఏర్పడుతోంది.అందుకు తోడు తగినంత బస్సులు లేకపోవడం వల్ల ప్రయాణికుల మధ్య తీవ్ర అల్లర్లకు దారి తీస్తోంది.

Free Bus Scheme In Telangana Leads To Chaos Daily Fights And Overcrowding Highli

ప్రతి రోజు మహిళలు, పురుషులు సీట్ల కోసం బస్సుల్లో గొడవ పడటం ఓ కామన్ సీన్ అయిపోయింది.మొన్నటి వరకు మహిళలు మహిళలతోనే వాగ్వాదానికి దిగినా, ఇప్పుడు పురుషులు-మహిళల మధ్య కూడా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.తాజాగా వేములవాడ - సిద్దిపేట రూట్లో ఒక మహిళ, ఒక మగవారిద్దరూ బస్సులో ఫిజికల్ ఫైటింగ్‌కి దిగిన ఘటన వైరల్ అయింది.

వీడియోలో ఆ వ్యక్తి మహిళను కాలితో తన్నగా, ఆమె కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించి అతనిని తన్నింది.ఈ ఘటనపై డ్రైవర్ స్పందించి, బస్సును ఆపి ఆ పురుషుడిని బస్సు నుంచి దింపేసిన సంఘటనను సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.

Free Bus Scheme In Telangana Leads To Chaos Daily Fights And Overcrowding Highli

ఈ ఘర్షణలకు ప్రధాన కారణం ప్రభుత్వ రవాణా సంస్థ తగినంత బస్సులు నడపకపోవడమే.పీక్ అవర్స్‌లో అదనపు సర్వీసులు లేకపోవడం వల్ల ప్రయాణికులు బస్సుల్లోకి ఎక్కేందుకు పోటీ పడుతున్నారు.ఇది ప్రయాణ భద్రతకే కాకుండా, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే ఘటనలకూ దారితీస్తోంది.

ఎన్టీఆర్ నీల్ మూవీ రిలీజ్ డేట్ విషయంలో పొరపాటు చేశారా.. అసలేం జరిగిందంటే?
పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన చిరుత.. దెబ్బకి దడుసుకున్న పోలీసు!

ప్రభుత్వం ప్రజల ప్రయోజనాల కోసమే ఈ పథకాన్ని తీసుకువచ్చింది.అయితే, అమలు పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ పథకం చివరికి ప్రజలకు అసౌకర్యం కలిగించే దిశగా వెళ్లే ప్రమాదం ఉంది.

Advertisement

అందువల్ల ప్రభుత్వానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.ఉచిత బస్సు పథకం అన్నది ఓ మంచి ఆలోచన.

కానీ, దాని అమలు మరింత సమర్థవంతంగా ఉండాలి.సద్వినియోగానికి మార్గం చూపకపోతే, మంచిని కూడా ప్రజలు అభాసుపాలు చేయొచ్చు.

అందుకే ప్రభుత్వం ప్రజల స్పందనను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయాలు తీసుకోవాలి.అప్పుడు మాత్రమే ఈ పథకం సఫలమవుతుంది.

తాజా వార్తలు