హైదరాబాద్ అబిడ్స్ లో ఘరానా మోసం.. రూ.200 కోట్లకు టోకరా

హైదరాబాద్ లోని అబిడ్స్ లో ( Abids ) ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

శ్రీ ప్రియాంక ఎంటర్ ప్రైజెస్( Sri Priyanka Enterprises ) పేరుతో దంపతులు మోసానికి పాల్పడ్డారని తెలుస్తోంది.

అధిక వడ్డీలు వస్తాయని ఆశ చూపించిన వాణీబాల, నేతాజీ దంపతులు రూ.కోట్లలో దండుకున్నారు.ఈ క్రమంలోనే మొత్తం రూ.200 కోట్ల వరకు వసూలు చేశారని తెలుస్తోంది.భారీ లాభాలు ఇస్తామంటూ సుమారు 517 మందికి టోకరా వేశారు.

అయితే మోసపోయామని గ్రహించిన బాధితులు బషీర్ బాగ్ పోలీస్ స్టేషన్( Basheerbagh Police Station ) ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు.టెస్కాబ్ లో జీఎంగా వాణీబాల పని చేసేవారు.

మోసాలను గుర్తించిన అధికారులు ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశారు.బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
Hair Fall : హెయిర్ ఫాల్ కి బెస్ట్ సొల్యూషన్.. ఒక్కసారి దీన్ని ట్రై చేశారంటే జుట్టు ఊడమన్నా ఊడదు!

తాజా వార్తలు