హిరణ్య కశ్యప ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అవుతున్న హాలీవుడ్ ప్రొడక్షన్

తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో తెరకేక్కబోతున్న మరో చిత్రం హిరణ్య కశ్యప్.

గుణశేఖర్ కలల ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాలో టైటిల్ రోల్ ని దగ్గుబాటి రానా పోషిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ కూడా జరిగిపోయింది.ఓ మూడేళ్ళ నుంచి ఈ ప్రాజెక్ట్ మీదనే గుణశేఖర్ వర్క్ చేస్తున్నాడు.

Fox Star Studios Collaborates With Hiranyakashyap Movie, Tollywood, Bollywood, I

ఏకంగా రెండు వందల కోట్ల బడ్జెట్ తో ఈ మైథలాజికల్ కథాంశంని విజువల్ వండర్ గా ఆవిష్కరించాలని అనుకున్నారు.అయితే లాక్ డౌన్ ఎఫెక్ట్ తో సురేష్ బాబు ఈ సినిమాని వాయిదా వేశాడు.

ఈ నేపధ్యంలో గుణశేఖర్ మరో క్రేజీ ప్రాజెక్ట్ ని శ్రీకారం చుట్టాడు.మహాభారతంలో అద్బుతమైన ప్రేమ కావ్యంగా భారతీయులు అందరూ చెప్పుకునే శకుంతల, దుష్యంతుడి కథని తెరపై పాన్ ఇండియా రేంజ్ లో ఆవిష్కరించడానికి రెడీ అయ్యాడు.

Advertisement

ఈ చిత్రానికి శాకుంతలం అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.ఇదిలా ఉంటే ఇప్పుడు హిరణ్య కశ్యప సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ బయటకి వచ్చింది.

ఈ సినిమా నిర్మాణంలో సురేష్ ప్రొడక్షన్ తో పాటు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ అయిన ఫాక్ స్టార్ స్టూడియోస్ కూడా భాగస్వామ్యం అవుతున్నట్లు తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఈ సినిమాని 200 కోట్లుతో కాకుండా మరింత గ్రాండ్ గా తెరకెక్కించాలని రానా భావిస్తున్నారు.

అలాగే 2022లో ఈ సినిమాని సెట్స్ పైకి కచ్చితంగా తీసుకొని వెళ్లాలని అనుకుంటున్నారు.త్రీడీ టెక్నాలజీలో సినిమాని ఆవిష్కరించేందుకు గుణశేఖర్ కి ఛాయస్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

వచ్చే ఏడాది గుణశేఖర్ శాకుంతలం సినిమాని వీలైనంత వేగంగా పూర్తి చేసి హిరణ్య కశ్యప మూవీని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్.

షియోమి/ రెడ్ మీ మొబైల్స్ లో మీకు పనికివచ్చే 7 రహస్య ట్రిక్స్
Advertisement

తాజా వార్తలు