కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

అంబేద్కర్ కోనసీమ జిల్లా( Ambedkar Konaseema District )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అమలాపురం( Amalapuram )లో ఆటోను లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.రాత్రి యానంలో బర్త్ డే పార్టీ చేసుకుని వెళ్తుండగా ఘటన చోటు చేసుకుందని తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement