ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు దుర్మరణం

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.వైరా మండలం స్టేజీ పినపాకలో కారును లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయని తెలుస్తోంది.స్పందించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Advertisement