ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ-వరల్డ్ ఛాంపియన్‎షిప్

ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ-వరల్డ్ ఛాంపియన్‎షిప్ జరగనుంది.హైదరాబాద్ లో ఇప్పటికే స్ట్రీట్ సర్క్యూట్ రేసింగ్ పూర్తయిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ట్యాంక్ బండ్ తీరంలో ఏర్పాటు చేసిన సర్క్యూట్ లోనే ఫార్ములా ఈ -రేస్ జరగనుంది.ఎన్విరాన్ మెంట్, ఎనర్జీ అండ్ ఎంటర్ టైన్ మెంట్ నినాదంతో రేసులో ఎలక్ట్రిక్ కార్లు పాల్గొననున్నాయి.

కాగా ఈ రేసులో మహింద్రా అండ్ మహింద్రా, ఫోర్డ్, జాగ్వార్ తో పాటు నిస్సాన్ వంటి పదకొండు కంపెనీల కార్లు పాల్గొననున్నాయని సమాచారం.కాగా తొలిసారిగా హైదరాబాద్ వేదికగా ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్ షిప్ జరగనుంది.

అయితే వరల్డ్ వైడ్ 14 దేశాల్లో 16 రౌండ్లుగా ఫార్ములా ఈ రేసింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ను నిర్వహించనున్నారు.ఈనెల 14న మెక్సికో సిటీలో తొలి రౌండ్ ఫార్ములా ఈ రేస్ ప్రారంభం కానుంది.

Advertisement

జనవరి 27, 28న దరియాహ్ సిటీలో రెండో, మూడో రౌండ్ ఫార్ములా ఈ రేస్ నిర్వహించనుండగా.ఫిబ్రవరి 11న హైదరాబాద్ లో నాలుగో రౌండ్ జరగనుంది.

అదేవిధంగా జూలై 30న లండన్ లో చివరి రౌండ్ ఉండగా.ఈ రేస్ లో మొత్తం 11 టీమ్స్ , 22 మంది రేసింగ్ డ్రైవర్లు పాల్గొననున్నారు.

ఈ క్రమంలో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటో మొబైల్ ప్రతినిధులు నగరానికి చేరుకున్నారు.సర్క్యూట్ సహా రేసింగ్ డ్రైవర్స్ సెఫ్టీ ప్రమాణాలను ఎఫ్ఐఏ ప్రతినిధులు పరిశీలించనున్నారు.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...
Advertisement