బెయిల్ పై ఉన్న పెద్దలకు.. జైలుపై మమకారం: అశోక్ గజపతిరాజు ఘాటైన వ్యాఖ్యలు

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, మాజీ కేంద్ర మంత్రివర్యులు అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్,బోర్డు సభ్యులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎవరు నియమించిన తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కాకపోతే ట్రస్టు ఆనవాయితీలను పాటించే విషయంలో  అడ్డు రాకూడదని ప్రస్తుత చైర్మన్ అశోక్ గజపతి రాజు స్పష్టం చేశారు.

విజయనగరం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అందరూ మహిళలనే తీసుకుంటే ఎవరైనా కాదన్నారా? అని ప్రశ్నించారు.ప్రభుత్వం ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డులకు తాము మాత్రం వ్యతిరేకం కాదన్నారు.

Former Union Minister Ashok Gajapathi Raju Sensational Comments On Ycp Governmen

ట్రస్ట్ పేరు చెప్పి కొంత మంది తెలుగుదేశం పార్టీ నేతలను పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో.ఎందుకు విడిచి పెట్టారో.ఇప్పటికీ ప్రశ్నగానే ఉందన్నారు.

ట్రస్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అర్థరహితంగా ఉందని ఆక్షేపించారు.రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేనటువంటి ట్రస్టు పై ఎందుకు దృష్టి పెట్టారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు.

Advertisement

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ట్రస్ట్ భూముల పై ఎక్కువ దృష్టి పెట్టినట్లు అనిపిస్తుంది.ఎప్పుడు మాట్లాడినా.

నన్ను జైలుకు పంపిస్తానని అంటున్నారు.బహుశా బెయిల్ పై వచ్చిన పెద్దలకు జైలు అంటే చాలా ఇష్టం అనుకుంటా.

అలా అనే నేను భావించాల్సి వస్తోందని అశోక్ గజపతి రాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు