వివేకానంద కేసు కచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అరెస్ట్ లు జరుగుతాయి - మాజీ మంత్రి పుల్లారావు

పల్నాడు జిల్లా చిలకలూరిపేట: మాజీ మంత్రి పుల్లారావు కామెంట్స్.

జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్తున్నానని తన కాపురం అక్కడే పెడుతున్నానని రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేస్తున్నారు.

మైసూర్ నుంచి వచ్చిన స్వామీజీ చెప్తే తన కాపురం విశాఖపట్నం మారుస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి చెప్పాలి.జగన్మోహన్ రెడ్డికి పులివెందుల కడప వెళ్లే ధైర్యం లేక విశాఖపట్నం అంటున్నాడు.

వివేకానంద కేసు కచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అరెస్ట్ లు జరుగుతాయి.ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక విజన్ , భవిష్యత్తు మీద దార్శనికత ఉన్న చంద్రబాబు వల్లే అయ్యిద్దని ప్రజలు నమ్ముతున్నారు.

ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలు చూస్తున్నారు.

Advertisement
అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమాలో ఎలాంటి క్యారెక్టర్ లో నటిస్తున్నాడో తెలుసా..?

తాజా వార్తలు