Anil Kumar Yadav: కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిపై జరిగిన దాడికి తమకు ఏం సంబంధం - మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్

నెల్లూరు నగర టిడిపి అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పై జరిగిన దాడికి.

తమకు ఏం సంబంధం అని ప్రశ్నించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

వారి వ్యక్తిగతమైన గొడవల నేపథ్యంలో ఓ యువకుడు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని కారుతో ఢీకొట్టాడని, నెల్లూరు జిల్లాలో ఏం జరిగినా తనపై తోసేయడం అలవాటైపోయిందని మండిపడ్డారు.దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ లన్నీ క్లియర్గా ఉన్నాయని, దాడి చేసిన యువకుడు తన నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి కూడా కాదని తెలిపారు.

Former Minister Anil Kumar Yadav Comments On Kotamreddy Srinivasulu Reddy Attack

యువకుడికి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి మధ్య వ్యక్తిగతమైన భేదాభిప్రాయాలు ఏమన్నా ఉన్నాయేమో విచారణలో తేలుతుందన్నారు.నెల్లూరు జిల్లా గంజాయికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని టిడిపి నేతలు అనడం హాస్యాస్పదంగా ఉందని ధ్వజమెత్తారు.

ఒక బీసీ నాయకుడైన తనపై నిరంతరం బురద చల్లడం మంచి పద్ధతి కాదని, దీన్ని మానుకోవాలని హితోపలికారు అనిల్ కుమార్ యాదవ్.నెల్లూరులో మీడియాతో ఆయన మాట్లాడాడు.

Advertisement
చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

తాజా వార్తలు