Shiva Balakrishna : ఆరో రోజు ఏసీబీ కస్టడీకి హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ..!

హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను( Former HMDA Director Shiva Balakrishna ) ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.

ఆరో రోజు కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ( ACB ) కీలక అంశాలపై ఆరా తీస్తుంది.

ఈ క్రమంలోనే రియల్ ఎస్టేట్ కంపెనీల్లో( Real Estate Companies ) పెట్టుబడులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు పలు రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రతినిధులను విచారిస్తున్నారు.

విచారణలో భాగగా రెండు ప్రముఖ కంపెనీల్లో శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టినట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.అలాగే రెరా కార్యాలయంలో( RERA Office ) స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను ఏసీబీ పరిశీలిస్తుంది.అయితే ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో భాగంగా ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

వైరల్ వీడియో : ఒకరినొకరు చెప్పుతో కొట్టుకున్న టీచర్స్..
Advertisement

తాజా వార్తలు