బీజేపీ గూటికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి..!?

ఉమ్మడి ఏపీలో కొద్ది రోజులపాటు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కమలదళంలోకి చేరనున్నారని తెలుస్తోంది.

ఇప్పటికే ఆయనతో బీజేపీ అగ్రనేతలు చర్చించారని సమాచారం.

ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.

కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది.అయితే తెలంగాణను కాంగ్రెస్ పార్టీనే ఏర్పాటు చేయడంతో ఆ పార్టీ నుంచి దూరమైయ్యారు.తరువాత జై సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేసినా.2014 ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో రాజకీయాలకు దూరమైయ్యారు.తాజాగా కాషాయ కండువా కప్పుకోనున్నారనే విషయం వినిపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు