జేడీఎస్ తో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై..!!

కర్ణాటక( Karnataka ) రాష్ట్రంలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ పార్టీ జేడీఎస్ తో పొత్తు పెట్టుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వస్తున్నాయి.

ఇదే సమయంలో ఇటీవల జేడీఎస్ నేత కుమార్ స్వామి ఢిల్లీ పర్యటనలో బీజేపీ( BJP ) పార్టీ పెద్దలతో సమావేశం కావడం జరిగింది.

దీంతో పొత్తుల ప్రచారం మరింత ఊపందుకుంది.అయితే వస్తున్న వార్తలపై కర్ణాటక బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ( Basavaraj Bommai )క్లారిటీ ఇవ్వటం జరిగింది.

రెండు పార్టీల పొత్తులపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు.రానున్న రాజకీయాల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలన్నారు.

భవిష్యత్తును కూడా అంచనా వేయటం కష్టమని పేర్కొన్నారు.

Advertisement

కాంగ్రెస్ ను నిలువరించేందుకు పలు పార్టీలు ఏకమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయని విలేకరులు వేసిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించడం జరిగింది.జేడీఎస్ తో బీజేపీ పొత్తులు పెట్టుకోబోతున్నట్లు చాలా మీడియా ఛానల్స్ చర్చలు చేస్తున్నాయి మేము అంతా గమనిస్తున్నామని అన్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బసవరాజ్ బొమ్మై.

జేడీఎస్ నేత కుమార్ స్వామి ఇటీవల ఢిల్లీ పర్యటనలో పలువురు బీజేపీ నేతలను కలిశారు.అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో అవగాహన పై పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని కుమారస్వామి అన్నారు.

ఇదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి తమ ముందు లేదంటూ సోమవారం కామెంట్లు చేయడం గమనార్హం.దీంతో దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు అనధికారికంగా కుదిరినట్టే అన్న ప్రచారం కర్ణాటక రాజకీయాల్లో వినబడుతుంది.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement