మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల..!!

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్( kcr ) ఫామ్ హౌస్ లో కాలు జారీ పడటంతో తుంటి ఎముక విరగడం తెలిసిందే.

ఈ క్రమంలో యశోద ఆసుపత్రిలో( Yashoda Hospital ) కుటుంబ సభ్యులు జాయిన్ చేయడం జరిగింది.

శుక్రవారం సాయంత్రం కేసీఆర్ కి హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ చేయటం జరిగింది.ఈ క్రమంలో శనివారం సాయంత్రం కేసీఆర్ కి సంబంధించి హెల్త్ బులిటెన్ విడుదల చేయడం జరిగింది.

ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.ఆపరేషన్ జరిగిన 12 గంటలలోపు రోగి నడవాలని.

అంబులెషైన్స్ గైడ్ లైన్స్ చెబుతున్నాయి.

Advertisement

దీని ప్రకారం కేసీఆర్ బెడ్ మీద నుంచి లేచి నిలబడగలుగుతున్నారు.ఫిజియోథెరపీ, ఆర్థోపెడిక్ వైద్యుల( Physiotherapy , orthopedic doctors ) పర్యవేక్షణలో నడుస్తున్నారు.ఆయనను వైద్య బృందం పర్యవేక్షిస్తుందని హెల్త్ బులిటన్ లో తెలియజేయడం జరిగింది.

ఇదిలా ఉంటే హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీ కావడంతో 6 నుంచి 8 వారాలు పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు ముందుగానే తెలియజేశారు.దీంతో కేసీఆర్ రెండు నెలలు పాటు.

ప్రజాక్షేత్రంలోకి రాని పరిస్థితి నెలకొంది.కాగా నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి.

ఈ క్రమంలో కేసీఆర్.లేకుండానే బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు హాజరయ్యారు.

ఉదయం సమయంలో ఖాళీ కడుపుతో తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే..!

ఇక ఇదే సమయంలో కేటీఆర్ కూడా గైర్హాజరు కావడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు