MLA Bajireddy Govardhan : కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్..!!

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది.

ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్( MLA Bajireddy Govardhan ) కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది.

ఈ క్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ తో కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు చేస్తున్నారని సమాచారం.మున్నూరు కాపు సామాజిక వర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలో బలమైన నేతగా ఉండటంతో బాజిరెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి( Congress party ) రావాలని ఆహ్వానిస్తోందని తెలుస్తోంది.

రానున్న లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా బాజిరెడ్డిని బరిలోకి దింపే యోచనలో హస్తం పార్టీ ఉందని సమాచారం.ఈ క్రమంలో బాజిరెడ్డితో కాంగ్రెస్ చర్చలు సఫలం అయితే నిజామాబాద్ ఎంపీగా ఆయన పోటీ చేసే అవకాశం ఉంది.

ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?
Advertisement