స్మార్ట్ ఫోన్ ను ఎక్కువగా వాడే వారికి.. ఈ జాయింట్స్ లో నొప్పులు రావడం ఖాయం..!

ఈ మధ్య కాలంలో ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్ర పోయేవరకు చాలామంది ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు.

దీని వల్ల ప్రజలు కొత్త కొత్త జబ్బుల బారిన పడుతున్నారు.

ఇప్పటికే దృష్టిలోపంతో చాలామంది బాధపడుతూ ఉంటే మరోవైపు ఒళ్ళు నొప్పులతో కూడా చాలామంది బాధపడుతున్నారు.తాజాగా ఒక పరిశోధనలో స్మార్ట్ ఫోన్లు( Smart phone ) ఎక్కువగా వాడడం ద్వారా చాలా రకాల జాయింట్ పాయింట్స్ వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆ జాయింట్ పెయిన్స్ ఎలా ఉంటాయో వాటి లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

For Those Who Use Smart Phone A Lot.. There Is Sure To Be Pain In These Joints..

స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడితే మెడ, భుజం నొప్పికి కారణం అవుతుంది.రోజు స్మార్ట్ ఫోన్లను రెండు నుంచి మూడు గంటలకు మించి ఉపయోగించడం వల్ల మెడ, భుజాల నొప్పి, నడుము నొప్పి వస్తుంది.ముఖ్యంగా మనం ఈ ఫోన్ ను పడుకొని వాడితే ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement
For Those Who Use Smart Phone A Lot.. There Is Sure To Be Pain In These Joints..

అందుకే స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించేటప్పుడు నిటారుగా కూర్చొని వాడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఈ జాయింట్ పెయింట్స్ దాదాపు చాలామంది ప్రజలలో కనిపిస్తూ ఉన్నాయి.

For Those Who Use Smart Phone A Lot.. There Is Sure To Be Pain In These Joints..

ఇంకా చెప్పాలంటే ఎక్కువగా చాటింగ్ చేసే యువతలో కార్పోమెటాకార్పల్ జాయింట్ , ఆస్టియో ఆర్థరైటిస్‌( Osteoarthritis )కు దారితీస్తుంది.ముఖ్యంగా చెప్పాలంటే యువతీ, యువకుల్లో ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తూ ఉంది.అయితే ఆస్టియో ఆర్థరైటిస్ అనేది వృద్ధుల వ్యాధి.

కొన్ని సందర్భాల్లో యువత అతిగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించడం వల్ల కార్పోమెటాకార్పల్ జాయింట్ క్షీణత కూడా కనిపిస్తుంది.ఇంకా చెప్పాలంటే మొబైల్ ఫోన్ ను అతిగా ఉపయోగించడం కోసం చేతులు నిరంతరం ఉపయోగించడం వల్ల మణికట్టు, రేడియల్ కోణంలో నొప్పి మొదలవుతుంది.

దానివల్ల మణికట్టు ప్రాంతంలో వాపు వచ్చే అవకాశం కూడా ఉంది.అందుకే స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు అతిగా చేతిని ఉపయోగిస్తే ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!
Advertisement

తాజా వార్తలు