ఇక్కడ టాయ్ ట్రైన్ చేసే పని చూస్తే విస్తుపోతారు!

మారుతున్న కాలం, మారుతున్న సాంకేతికతతో పాటు ఉపాధి, వ్యాపారమార్గాలు కూడా నిరంతం మారుతున్నాయి.ముఖ్యంగా కరోనా తర్వాత మారిన పరిస్థితులు ప్రజలను ఆలోచింపజేశాయి.

అందుకే ఇటువంటి ప‌రిస్థితుల్లో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకర్షించేందుకు ఓ రెస్టారెంట్ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది.ఈ రెస్టారెంట్‌లో వెయిటర్‌ల ద్వారా కాకుండా టాయ్ రైళ్ల ద్వారా కస్టమర్‌కు ఆహారం అందిస్తారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వినియోగ‌దారులు ఈ వినూత్న‌ పద్ధతిని చాలా ఇష్టపడుతున్నారు.

అందుకే ఈ ఉదంతానికి సంబంధించిన విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.గుజరాత్‌లోని సూరత్‌కి చెందిన ఈ వైరల్ వీడియో.

Advertisement

ట్రైనియన్ ఎక్స్‌ప్రెస్ పేరుతో ఉన్న రెస్టారెంట్‌కి సంబంధించిన‌ది.కస్టమర్లను ఆకర్షించడానికి ఈ రెస్టారెంట్ ఈ ప్రత్యేకమైన విధానంతో ముందుకు వచ్చింది.

ఈ రెస్టారెంట్‌లో వెయిటర్లు ఆహారం అందించరు.టాయ్ రైళ్ల ద్వారా అందిస్తారు.

రెస్టారెంట్ కిచెన్ నుంచి టాయ్ ట్రైన్ బయలుదేరి సీటింగ్ ఏరియా దగ్గరికి ఎలా చేరుకుంటుందో ఒక వీడియోలో ప్ర‌ద‌ర్శించారు.పాప‌డ్, బ్రెడ్, గ్రేవీ త‌దిత‌ర‌ ఫుడ్ ఐటమ్స్ వివిధ కంపార్ట్ మెంట్లలో ఉంచుతారు.

అది క‌స్ట‌మ‌ర్ల దగ్గర ఆగుతుంది.అప్పుడు క‌స్ట‌మ‌ర్ల‌ దాని ద‌గ్గ‌ర నుండి ఆహారాన్ని తీసుకుంటారు.

కఠినమైన చర్మాన్ని సూపర్ స్మూత్ గా మార్చే సింపుల్ టిప్ మీకోసం!

ఈ విధంగా టాయ్ రైలు ముందుకు వెళుతుంది.రెస్టారెంట్‌లోని ఈ విధానాన్ని ఆహార ప్రియులు ఎంత‌గానో ఇష్టపడుతున్నారు.

Advertisement

రెస్టారెంట్ తీరుతెన్నుల‌ను ప్రశంసిస్తున్నారు.మీరు ఆర్డర్ చేసిన వెంట‌నే ఈ టాయ్ ట్రైన్ ఆహారాన్ని క‌స్ట‌మ‌ర్ల‌కు అందజేస్తుంది.

మీరూ ఒకసారి ప్రయత్నించండి.రెస్టారెంట్‌లోని వాతావ‌ర‌ణం చాలా బాగుంది.

ఆహారం కూడా రుచికరంగా ఉంది.అంటూ ప‌లువురు ఆహార ప్రియులు కామెంట్ చేస్తున్నారు.

తాజా వార్తలు