ఏలూరు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ..!

ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడ బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మూడు రోజుల క్రితం మధ్యాహ్నం భోజనం వికటించి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.

సుమారు 30 మందికి పైగా విద్యార్థులకు వాంతులు, విరోచనాలు అయ్యాయి.అయితే విషయం బయటకు రానివ్వకుండా కొందరికి ఆస్పత్రిలో, మరికొందరికి ఇళ్ల దగ్గరే చికిత్స అందిస్తున్నారని సమాచారం.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.దీంతో విషయం బయటకు వచ్చింది.

Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!
Advertisement