వారంలో రెండు సార్లు ఈ చిట్కాను పాటిస్తే మచ్చలేని మృదువైన చర్మం మీ సొంతం!

ప్రస్తుతం చలికాలం కొనసాగుతోంది.ఈ సీజన్ లో చర్మం తరచూ పొడిబారిపోయి నిర్జీవంగా మారుతుంటుంది.

ఖరీదైన మాయిశ్చరైజర్స్ వాడిన సరే ఒక్కోసారి మంచి ఫలితం ఉండదు.అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాను కనుక వారంలో రెండంటే రెండు సార్లు పాటిస్తే పొడి చర్మం అన్న మాటే అనరు.

చర్మం తేమ‌గా, మృదువుగా మారుతుంది.పైగా ఈ చిట్కాను పాటించడం వల్ల మొండి మచ్చలు సైతం దూరం అవుతాయి.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటి అనేది తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో పది బాదం పప్పులను వేసి వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

Advertisement

మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు కొబ్బరి ముక్కలను వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో కొబ్బరి పాలను ఫిల్టర్ చేసుకుని పెట్టుకోవాలి.

ఆ తర్వాత నైట్ అంతా నానబెట్టుకున్న బాదం పప్పుల పొట్టు తొలగించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో పొట్టు తొలగించిన బాదం పప్పు మరియు అరకప్పు కొబ్బరి పాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్‌ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి కాస్త మందంగా అప్లై చేసుకుని డ్రై అయ్యేంత వరకు వేచి ఉండాలి.పూర్తిగా ఆరిన తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.వారంలో రెండే రెండు సార్లు ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చర్మం తేమగా, మృదువుగా మారుతుంది.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!

మొండి మచ్చలు క్రమంగా మాయం అవుతాయి.చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది.

Advertisement

మ‌రియు ముడతలు త్వరగా రాకుండా సైతం ఉంటాయి.

తాజా వార్తలు