ఎటువంటి క్రీమ్స్ అక్కర్లేదు.. ఈ చిట్కాను పాటిస్తే సూపర్ గ్లోయింగ్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం!

ఎటువంటి మచ్చలు లేకుండా తమ ముఖ చర్మం అందంగా, కాంతివంతంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.ముఖ్యంగా మగువలు అటువంటి స్కిన్ కోసం తహతహలాడుతుంటారు.

ఈ క్రమంలోనే ఖరీదైన ఫేస్ క్రీములు వాడుతుంటారు.అయితే మార్కెట్లో లభ్యమయ్యే క్రీముల వల్ల ఎంత వరకు ప్రయోజనం ఉంటుంది అన్నది పక్కన పెడితే.

ఇప్పుడు చెప్పబోయే ఇంటి చిట్కా మాత్రం మీ చర్మానికి ఒక వరం అని చెప్పుకోవచ్చు.ఈ చిట్కాను పాటిస్తే సూపర్ గ్లోయింగ్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.

అందుకోసం ముందుగా మిక్సీ జార్‌ తీసుకుని అందులో చేతినిండా పుదీనా ఆకులు ( Mint leaves )మరియు చేతినిండా వేపాకులు వేసుకుని పావు కప్పు రోజ్ వాటర్ ( Rose water )పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి( rice flour ), వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి ( Sandalwood powder )వేసుకోవాలి.

Advertisement

అలాగే హాఫ్‌ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ బాదం నూనె, హాఫ్‌ టేబుల్ స్పూన్ గ్లిజరిన్, హాఫ్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ మరియు సరిపడా పుదీనా-వేపాకు జ్యూస్ వేసుకొని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు పూతలా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకోవాలి.ఆపై తడి క్లాత్ సహాయంతో వేసుకున్న ప్యాక్ ను తొలగించి వాటర్ తో వాష్ చేసుకోవాలి.వారానికి రెండంటే రెండు సార్లు ఈ సింపుల్ ఇంటి చిట్కాను కనుక పాటిస్తే చ‌ర్మంపై ఎంతటి ముదురు రంగు మచ్చలు ఉన్న తగ్గుముఖం పడతాయి.

పిగ్మెంటేషన్ సమస్య దూరం అవుతుంది.మొటిమల బెడద తగ్గుతుంది.బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి.

స్పాట్ లెస్ స్కిన్ మీ సొంతం అవుతుంది.అలాగే చర్మం సూపర్ గ్లోయింగ్ గా మరియు షైనీ గా మెరిసిపోతుంది.

జనతా గ్యారేజ్ విషయంలో జరిగిన తప్పు దేవరలో జరగదు.. కొరటాల కామెంట్స్ వైరల్!
ఎంజీఆర్ తిరస్కరించిన పాత్రకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్..

కాబట్టి మచ్చలేని అందమైన మెరిసే చర్మం కోసం తప్పకుండా ఇప్పుడు చెప్పుకున్న హోమ్ రెమెడీని ప్రయత్నించండి.

Advertisement

తాజా వార్తలు