ఈ చిన్న చిట్కాను ఫాలో అయితే మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది.. తెలుసా?

సాధారణంగా కొందరికి హెయిర్ గ్రోత్( Hair growth ) అనేది చాలా తక్కువగా ఉంటుంది.కొందరికి అస్సలు ఉండదు.

ఇలాంటి వారి జుట్టు రోజురోజుకు పల్చగా మారిపోతుంటుంది.దాంతో తెగ హైరానా పడిపోతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే మీకు ఇప్పుడు చెప్పబోయే చిట్కా సూపర్ ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది. ఈ చిన్న చిట్కా ను ఫాలో అయితే మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది.

మరి ఇంతకీ ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ముందుగా ఒక కలబంద ఆకును( Aloe Vera j ) తీసుకొని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.అలాగే కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి.

దాంతో వాటర్ కాస్త చిక్కగా మారుతుంది.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయ్యాక అందులో మూడు టేబుల్ స్పూన్లు మందారం పొడి,( Hibiscus Powder ) వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ చిట్కాను పాటిస్తే హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి.జుట్టు రాలడం తగ్గుతుంది.అదే సమయంలో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

దీంతో పల్చగా ఉన్న మీ జుట్టు ఒత్తుగా మారుతుంది.కాబట్టి జుట్టు పెరగడం లేదని సతమతం అవుతున్న వారు తప్పకుండా ఈ హెయిర్ ప్యాక్ ను ట్రై చేయండి.

Advertisement

మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు