ఈ సింపుల్ రెమెడీని పాటిస్తే మేకప్ అక్కర్లేదు.. న్యాచురల్ గానే మెరిసిపోతారు!

సాధారణంగా ఇటీవల రోజుల్లో చాలా మంది మేకప్ లేకుండా బయటకు రావడం లేదు.మేకప్ అనేది డైలీ రొటీన్ లో ఒక భాగం అయిపోయింది.

చుట్టూ ఉన్నవారికి అట్రాక్టివ్ గా కనిపించేందుకు మేకప్ తో మెరుగులు దిద్దుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని పాటిస్తే మేకప్ అక్కర్లేదు.

న్యాచురల్ గానే అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ బీట్ రూట్ పౌడర్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ వేపాకుల పౌడర్, పావు టేబుల్ స్పూన్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి( Multani Mitti ), హాఫ్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్, సరిపడా రోజ్‌ వాటర్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

Advertisement

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మరియు మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఆపై మంచి మాయిశ్చరైజర్( Moisturizer ) ను అప్లై చేసుకోవాలి.

రెండు రోజులకు ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే మేకప్ పై ఆధారపడాల్సిన అవసరమే ఉండదు.

బీట్ రూట్ పౌడర్( Beetroot Powder ) లో ఉండే పలు సుగుణాలు చర్మ ఛాయను మెరుగు పరుస్తాయి.స్కిన్ ను షైనీ గా మెరిపిస్తాయి.వేపాకుల పొడి, పసుపు మచ్చలను మాయం చేస్తాయి.

మొండి మొటిమలకు అడ్డుకట్ట వేస్తాయి.క్లియర్ స్కిన్ ను అందిస్తాయి.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...

అలాగే ముల్తానీ మట్టి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. ఫేషియల్ గ్లో( Facial Glow ) ను అందిస్తుంది.

Advertisement

కాబట్టి సహజంగానే అందంగా ఆక‌ర్ష‌ణీయంగా మెడిసిపోవాలని భావిస్తున్న వారు త‌ప్ప‌కుండా పైన చెప్పిన హోమ్ రెమెడీని పాటించండి.మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు