Nayanthara Young Look : నయనతార మాదిరి 40 లోనూ 20లా కనిపించాలనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీ మీకోసమే!

సాధారణంగా కొందరు వయసు పైబడిన కూడా చాలా యవ్వనంగా కనిపిస్తుంటారు.మ‌న‌ లేడీ సూపర్ స్టార్ నయనతార( Nayanthara ) ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

40కి చేరువైనా నయనతార ఎంతో యవ్వనమైన చర్మంతో( Young Look ) ఎప్పటికప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది.తన అందంతో కుర్ర‌కారును కేరింతలు కొట్టేలా చేస్తోంది.

మరి మీరు కూడా నయనతారలా 40 లోనూ 20లా కనిపించాలనుకుంటున్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ ని అస్సలు మిస్ అవ్వకండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) వేసుకుని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి.

ఇలా వేయించుకున్న అవిసె గింజలు మిక్సీ జార్ లో వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ అవిసె గింజల పౌడర్ ను వేసుకోవాలి.

Advertisement

అలాగే వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ) మరియు నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు( Raw Milk ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు పూతలా అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.అవిసె గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ముడతలు, చారలు, చర్మం సాగటం వంటి వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడతాయి.స్కిన్ ఇరిటేషన్‌ను తగ్గిస్తాయి.చర్మాన్ని కాంతివంతంగా మరియు యవ్వనంగా మెరిపిస్తాయి

అవిసె గింజలు మీ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి, పొడిబారకుండా చేయ‌డానికి కూడా తోడ్ప‌డ‌తాయి.అలాగే కాఫీ పౌడర్ స్కిన్ టోన్( Skin Tone ) మెరుగుపరుస్తుంది.చర్మంపై మెండి మచ్చలను మాయం చేస్తుంది.

కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

ఇక పాలు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.ఏజింగ్ ప్రాసెస్‌ను ఆలస్యం అయ్యేలా చేస్తాయి.

Advertisement

ఫైనల్ గా రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని పాటించారంటే వయసు పైబ‌డిన కూడా మీ చర్మం యవ్వనంగా నిగారింపుగా మెరిసిపోతుంది.

తాజా వార్తలు