Dark Lips : ఈ రెండు సింపుల్ చిట్కాలను పాటిస్తే డార్క్ లిప్స్ ను ఈజీగా వదిలించుకోవచ్చు!

డార్క్ లిప్స్( Dark Lips ).చాలా మందిని కామన్ గా కలవరు పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.

ముఖాన్ని అందంగా చూపించే భాగాల్లో పెదాలు ఒకటి.అటువంటి పెదాలు నల్లగా ఉంటే ఏమాత్రం సహించలేరు సూర్యరశ్మి, ధూమపానం, హైపర్ పిగ్మెంటేషన్, కొన్ని రకాల మందుల వాడకం, డిహైడ్రేషన్ పెదవులను నల్లగా మార్చడానికి దోహదం చేస్తాయి.

కారణం ఏదైనా సరే పెదాలు నల్లగా ఉంటే చూడటానికి కాస్త అసహ్యంగా మరియు కాంతి హీనంగా కనిపిస్తాయి.ఈ క్రమంలోనే డార్క్ లిప్స్ ను రిపేర్ చేసుకునేందుకు తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెండు సింపుల్ చిట్కాలను( Simple Remedies ) మీరు తప్పక ట్రై చేయాల్సిందే.ఈ చిట్కాలతో చాలా ఈజీగా మరియు వేగంగా డార్క్ లిప్స్ ను వదిలించుకోవచ్చు.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెండు టిప్స్ ఏంటో ఓ చూపు చూసేయండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ హనీ( Honey ) వేసుకుని బాగా ఫిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని పెదాలకు అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఉంచుకోవాలి.ఆపై వేళ్ళతో సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకుంటూ వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.

‌తేనె పెదాలపై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్( Dead Skin Cells ) ను తొలగిస్తుంది.లెమన్ జ్యూస్ నలుపును పోగొడుతుంది.

ఈ చిట్కా తర్వాత మరొక బౌల్ తీసుకుని అందులో పావు టేబుల్ స్పూన్ పసుపు( Turmeric ), హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు, హాఫ్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్( Rose Water ) వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఈ రెమెడీ పెదాల నలుపును సహజంగానే వదిలిస్తుంది.మీ లిప్స్ ను అందంగా మారుస్తుంది.

Advertisement

కాబట్టి డార్క్ లిప్స్ తో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఈ రెండు చిట్కాలను పాటించారంటే చాలా వేగంగా పెదాల నలుపును వదిలించుకోవచ్చు.లిప్స్ ను అందంగా కాంతివంతంగా మెరిపించుకోవచ్చు.

తాజా వార్తలు